సోష‌ల్ మీడియా.. ఇప్పుడు జ‌నం జీవితంలో ఒక భాగ‌మైపోయింది. సోష‌ల్ మీడియాను జ‌నం పిచ్చ పిచ్చ వాడేస్తున్నారు. ఒక‌టేంటీ.. ఇంటి విష‌యాల ద‌గ్గ‌ర నుంచి రాజ‌కీయాల వ‌ర‌కు అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇక మ‌రికొంద‌రైతే ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నారు.. వాడుకున్నోడికి వాడుకున్నంత రేంజ్‌లో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఉప‌యోగిస్తున్నారు. ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌పై కామెంట్లు, సెటైర్లు వేస్తూ ర‌ఫ్ ఆడేస్తున్నారు. ఇంకొంద‌రైతే అభ్యంత‌ర‌క వ్యాఖ్య‌లు చేసి అన‌వ‌స‌ర‌మైన చిక్కుల్లో ప‌డుతున్నారు. 


మ్యాట‌ర్ ఏంటంటే తెలంగాణ సీఎం కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ క‌విత‌పై దుష్ప్ర‌చారం చేశారు. ఫేస్ బుక్‌లో అస‌భ్య‌ర రాత‌లు రాశాడు అంతేకాదు వారి ఫోటోల‌ను మార్పింగ్ చేశాడు. మార్ఫింగ్ చేసి ఫెస్ బుక్‌లో షేర్ చేశాడు. అస‌భ్య‌క‌ర కామెంట్లు పెట్టాడు. దీనిపై టీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ మండిప‌డింది. కేసీఆర్ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా, క‌విత వ్య‌క్తిత్వాత‌న్ని దెబ్బ‌తీసేలా పేస్ బుక్‌లో పోస్టులు ఉన్నాయంటూ స్టూడెంట్ విభాగం అధ్య‌క్షుడు గెల్లి శ్రీనివాస్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 


ఇక దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు మ‌హ‌బూబ్‌నగ‌ర్ జిల్లా న‌వాబ్ పేట్‌లో ఉంటున్న ప్ర‌వేట్ ఉద్యోగి చిప్రా న‌రేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌డే ఇలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాత‌లు రాస్తున్నాడంటూ గుర్తించారు. త‌న రెండు ఫేస్‌బుక్ ఎకౌంట్ల‌లో కూడా న‌రేష్ సీఎం కేసీఆర్‌, క‌వితల‌ను ఉద్దేశించి అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు పోలీసులు తేల్చిప‌డేశారు. ఈ నేప‌థ్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, ఇటీవ‌లె కేసీఆర్ పై టిక్ టాక్ వీడియో చేసిన క‌రీంన‌గ‌ర్ యువ‌కుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: