గత కొంత కాలంగా ప్రపంచ దేశాలన్నింటికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్  కరడుగట్టిన ఉగ్రనేత, జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు.  తాను నమ్మిన సిద్దాంతం కోసం ఎన్నో వేల మంది అమాయకుల ప్రాణాలు తీయించాడు.  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో బాంబ్ బ్లాస్ట్ లు చేశాయి..ఎన్నో వందల మంది ప్రాణాలు తీశారు..ఎన్నో వేల మంది అనాధలను చేశారు. 


 ఈ మద్య పుల్వామా దాడి కూడా జైషే మహ్మద్ చేసిన పనే.  అప్పటి నుంచి  భారత్  జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు సూచిస్తూ వచ్చింది.  ఎంతోకాలంగా భారత్ చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇన్నాళ్లూ తనకున్న వీటో పవర్ తో మసూద్ అజహర్ ను కాపాడుకొచ్చిన చైనా ఈసారి ఎలాంటి అడ్డుపుల్లలు వేయకుండా, గతంలో తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం వాపసు తీసుకుంది.  


ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైతం  మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయడం తమకు అభ్యంతరం లేదని చెప్పింది. తాజా ప్రకటన అనంతరం మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతున్నట్టు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు.  విదేశాల్లో ఉన్న అతని ఆస్తులు జప్తు చేసే వీలుండడంతోపాటు, అతడి ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడనుంది. ఏ దేశ ప్రభుత్వమైనా మసూద్ అజహర్ పై చర్యలు తీసుకునే వీలుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: