ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజ‌యం ల‌భించింది. పఠాన్‌కోట్, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైషే  మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మసూద్‌ అజర్‌కు చెందిన ఆస్తులను స్తంభింపజేయనున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్‌ పేరు చేర్చింది. అయితే మ‌సూద్‌ను ఐరాస బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకుండా చైనా నాలుగు సార్లు అడ్డుకుంది. అయిన‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు భార‌త్‌దే విజ‌యం సాధించింది.  అజార్‌ విషయంలో చైనా పెట్టిన కండీష‌న్స్‌ను వెనక్కి తీసుకోవడంతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది.


డ్రాగన్‌పై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ పతాక స్థాయిలో ఒత్తిడి చైనా దిగిరాక త‌ప్ప‌లేదు. ఈ నిర్ణ‌యంతో అటు పాక్ కూడా వెంట‌నే రెస్పాండ్స్ అయ్యింది. అత‌డికి గ్లోబ‌ల్ ఉగ్ర‌వాది ట్యాగ్ ఇవ్వ‌డం ప‌ట్ల ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు పాక్‌. అత‌డిని బ్లాక్ లిస్టులో చేర్చిన‌ట్లు భార‌త అంబాసిడ‌ర్ స‌య్య‌ద్ అక్బ‌రుద్దీన్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. మ‌సూద్ అజార్‌ను ఐక్య రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా తేల్చింది.. ఈ విష‌యంలో అంద‌రి స‌పోర్ట్ చాలా గొప్ప‌విష‌యమంటూ అక్బ‌రుద్దీన్ ట్వీట్ చేశారు. ఇక అత‌డి అస్తులు స‌హా ఇత‌ర ఇంకా ఇత‌ర దేశాల్లో ఏమైనా ఉంటే జ‌ప్తు చేసేందుకు ఆయా దేశ ప్ర‌భుత్వాలు చర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని పేర్కాన్నారు. 


కాగా.. ఫిబ్ర‌వ‌రి 14 వ తేదీన జ‌మ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జ‌వాన్ల వాహ‌నంపై జ‌రిగిన దాడిలో 41 మంది జ‌వాన్లు అమ‌రులైయ్యారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే వెంట‌నే ఆ ఘ‌ట‌నకు తామే కార‌ణ‌మంటూ చెప్ప‌డంతో జైషే మ‌హ్మ‌ద్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ చీఫ్ మ‌సూద్ అజార్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించాలంటూ ఐక్య రాజ్య స‌మితిని భార‌త్ డిమాండ్ చేసింది. అందుకు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిట‌న్ దేశాలు భార‌త్ కు అండ‌గా న‌లిచాయి. అయినప్ప‌టికీ చైనా మాత్రం వెన‌కాడింది. చివ‌రికి అంద‌రి ఒత్తిడితో చైనా దిగిరాక త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు భార‌త్ మ‌రో పెద్ద విష‌యాన్ని సాధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: