Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:33 pm IST

Menu &Sections

Search

టీడీపీలో వెన్నుపోట్లు... న‌మ్మ‌క‌ద్రోహాలు... ఎవ‌రు ఎవ‌రికి

టీడీపీలో వెన్నుపోట్లు... న‌మ్మ‌క‌ద్రోహాలు... ఎవ‌రు ఎవ‌రికి
టీడీపీలో వెన్నుపోట్లు... న‌మ్మ‌క‌ద్రోహాలు... ఎవ‌రు ఎవ‌రికి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీకి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత పార్టీ నేత‌ల నుంచే వెన్నుపోట్లు ఎదుర‌య్యాయి. మ‌రికొంద‌రు పార్టీ అభ్య‌ర్థుల‌ను చివ‌రి వ‌ర‌కు న‌మ్మించి నిండా ముంచ‌డంతో పాటు న‌మ్మ‌క ద్రోహానికి పాల్ప‌డ్డారు. ఇక కొంద‌రు నేత‌లు పార్టీ అభ్య‌ర్థి ఇచ్చిన డ‌బ్బులు పంచ‌కుండా వాటిని దాచేసుకున్నారు. ఇలా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో.. ఒక్కో అభ్య‌ర్థి ఒక్కో విధ‌మైన మోసానికి గురైన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఎవ్వ‌రూ వీటిపై నోరు మెద‌ప‌లేదు. ఇప్పుడు ఎన్నిక‌లు కంప్లీట్ అయ్యి ఫ‌లితాల కోసం సుదీర్ఘంగా వెయిట్ చేయాల్సి రావ‌డంతో ఇవ‌న్నీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు సైతం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోన్న అభ్య‌ర్థులు వీటిని బాబు వ‌ద్ద ఫిర్యాదు చేయ‌గా ఆ వెన్నుపోటు, కుట్ర‌దారుల‌పై చంద్ర‌బాబు తీవ్ర‌మైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు పార్టీలో ఉంటారా ?  పోతారా ? అని కూడా వార్నింగ్‌లు ఇస్తున్న‌ట్టు భోగ‌ట్టా.


ఈ వెన్నుపోట్లు సాధార‌ణ అభ్య‌ర్థుల‌కే కాదు మంత్రుల‌కూ త‌ప్ప‌లేదు. నెల్లూరులో మంత్రి నారాయ‌ణ ఏకంగా రూ.100 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఓట‌ర్ల‌కు పంచ‌మ‌ని ఇచ్చిన రూ.40 కోట్ల సొమ్మును న‌గ‌రంలో ఉండే న‌లుగురు కీల‌క‌నేత‌లు దాచేసుకున్నారు. ఓ మాజీ మంత్రి, ఆయ‌న భార్య‌తో పాటు మ‌రో మాజీ ఎమ్మెల్యే, మ‌రో కీల‌క నేత ఇలా న‌లుగురు క‌లిసి ఎవ‌రికి ఇచ్చిన డ‌బ్బును వారు పంచ‌లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత ఈ విష‌యం నారాయ‌ణ‌కు తెలిసినా ఆయ‌న చేసేదేం లేక‌పోయింది. ఆ త‌ర్వాత వాళ్ల‌కు ఫోన్ చేసి.. మీరు న‌న్ను న‌మ్మించి మోసం చేశార‌ని అన‌డం మిన‌హా ఆయ‌న ఎవ‌రికి చెప్పుకోలేక గ‌మ్మునుండిపోయారు.


ఇక అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో చంద్ర‌బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కు కూడా సీటు ఇవ్వ‌లేదు. ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు అనే కొత్త వ్య‌క్తికి బాబు సీటు ఇచ్చారు. అక్క‌డ సీటు రాని వాళ్లు టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేయ‌వ‌ద్ద‌ని తెర‌వెన‌క కుట్ర‌లు చేశారు. అలాగే అభ్య‌ర్థి త‌ర‌పున పంచాల్సిన డ‌బ్బును కూడా నొక్కేశారు. ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు గెలిస్తే ఎక్క‌డ త‌మ పెత్త‌నానికి బ్రేక్ ప‌డుతుంద‌ని.. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు శూన్యం అవుతుంద‌నే వారు ఆయ‌న్ను ఓడించేందుకు ప్లాన్ చేశారు. ఎన్నిక‌లు ముగిశాక ఉమ‌హేశ్వ‌ర‌నాయుడు టీడీపీలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసి, ఎన్నో పదవులు అనుభవించారు.. చివరికి టీడీపీలోనే ఉంటూ పార్టీకే ద్రోహం చేస్తారా ? అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తనకు వ్యతిరేకంగా పనిచేసినట్లు తన వద్ద ఫోన్‌ కాల్స్‌ రికార్డింగ్‌, వీడియో క్లిప్పింగులు కూడా ఆధారాలున్నాయన్న ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు వాటిని చంద్ర‌బాబు వ‌ద్ద పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌లేదు. ఇందుకు ఆయ‌న స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణం. ఈ క్ర‌మంలోనే ఏకంగా ఎమ్మెల్యే టికెట్ బొర‌గం శ్రీనివాస్‌కు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో బొర‌గంకు అండ‌గా నిల‌వాల‌ని, టీడీపీ ప‌క్షాన ప్ర‌చారం చేయాల‌ని సూచించారు. పార్టీని గెలిపించాల‌ని ఆదేశించారు. పైకి చంద్ర‌బాబు వ‌ద్ద మొహ‌మాటానికి ఓకే చెప్పిన మొడియం బొర‌గం నుంచి రూ.5 ల‌క్ష‌లు ఖ‌ర్చుల కోసం తీసుకుని ఇంట్లో ప‌డుకున్నారు. అదేమంటే.. ఎండ‌లు మండిపోతున్నాయ‌ని, త‌న‌కు ఆరోగ్యం బాగోలేద‌ని చెప్పుకొచ్చారు. ఇలా పార్టీ నుంచి ల‌బ్ధి పొంది ఐదేళ్ల పాటు ప‌ద‌వులు అనుభ‌వించిన వారంద‌రు ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఇలా మోసం చేయ‌డంపై బాబు ఆగ్ర‌హంతో ఉన్నారు. రేపు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వీరిపై పార్టీ ప‌రంగా చ‌ర్య‌లు ఉండ‌నున్నాయి.


tollywood-news-bollywood-news-kollywood-news-holly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సామాన్యుడికి జ‌గ‌న్ నుంచి ఊహించ‌ని స‌ర్‌ఫ్రైజ్
హ‌రీష్‌కు కేసీఆర్ ఇలా కూడా పొగ పెట్టేస్తున్నారా...
కృష్ణ ఫ్యామిలీతో విజ‌య‌నిర్మ‌ల‌కు క‌ష్టాలు...
విజ‌య‌నిర్మ‌ల ప్ర‌పంచ రికార్డులు చూస్తే.... హ్యాట్సాప్ చెప్పాల్సిందే
ఆ టాప్ హీరోయిన్ విజ‌య‌నిర్మ‌ల కూతురే... తెలుసా
కృష్ణ - విజ‌య‌నిర్మ‌ల ప్రేమకు కార‌ణం ఇదే...
అబ్బాయికి 18.... అమ్మాయికి 17... కృష్ణా జిల్లాలో ఏం జ‌రిగిందంటే...
పీవీ.సింధు హోట‌ల్ బిల్ సీక్రెట్‌గా క‌ట్టిన హీరో
చంద్ర‌బాబు రైట్ హ్యాండ్‌... మాజీ మంత్రి మిస్సింగ్‌
హైద‌రాబాద్‌లో న‌టి మిస్‌
బ్రేకింగ్‌: టీడీపీలో ఇద్ద‌రు ఎమ్మెల్యేల వికెట్లు డౌన్‌
బ్రేకింగ్‌: ఢిల్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు
సురేష్ ప్రొడ‌క్ష‌న్ ( SP ) లోగో వెన‌క ఇంత స్టోరీ ఉందా..!
జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై ఏపీ మంత్రి సంచ‌ల‌న కామెంట్స్‌
ఆ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే పార్టీ మార‌డం ప‌క్కా...
పూజా అంత ప‌నికి రాదు... ఇలా అయితే మూటా మ‌ల్లు స‌ర్దుకోవాల్సిందే
పాపం ప్రియా వారియ‌ర్‌....
బాబు చేసుకున్న పాపం.. జ‌గ‌న్ చేసుకున్న పుణ్యం ఇదేనా..!
టీడీపీకి షాక్‌... బీజేపీలోకి బాల‌య్య బంధువు
ఈ ముదురు హీరోయిన్ పెళ్లి ఆ హీరోతోనే...
ఆ హీరోయిన్‌తో ముర‌ళీమోహ‌న్‌కు పెళ్లి... సంచ‌ల‌న విష‌యం రివీల్‌
ఆ హీరోయిన్ చేతిలో నితిన్‌కు ఘోర అవ‌మానం...
హోదా కోసం జ‌గ‌న్ కొత్త ప్లాన్‌... స‌క్సెస్ అయితే సూప‌ర్ హిట్టే..
పోసానిని ఇండ‌స్ట్రీలో అణ‌గ దొక్కేస్తున్నారా... ఏం జ‌రుగుతోంది..
మెగా హీరోను ప‌ట్టేసిన ఐరెన్‌లెగ్ హీరోయిన్‌
బ్రేకింగ్‌: వ‌ంగ‌వీటి రాధా జ‌న‌సేన ఎంట్రీకి ముహూర్తం ఇదే
ఆ క్రేజీ హీరో - హాట్ హీరోయిన్ బ్రేక‌ప్ క‌న్ఫార్మ్‌
కేసీఆర్‌తో జ‌గ‌న్ వైఖ‌రి ఏంటి.. అంద‌రిలోనే ఈ ఒక్క‌టే హాట్ డౌట్‌...
నాగార్జున ఆ హీరోను కొట్టాడా.... షూటింగ్‌లో గంద‌ర‌గోళం
జ‌గ‌న్‌ను ఇలా ఊహించ‌లేక పోయారు... ఇప్పుడు ఏం చేస్తున్నారంటే...
సుత్తి లేదు.. సోదీ లేదు.. జ‌గ‌న్ ఇర‌గ‌దీశాడుగా..!
ప‌వ‌న్‌కు మంటపెట్టేశాడు... వాళ్ల కారు డ్రైవ‌ర్లు కూడా జ‌న‌సేన‌లో చేర‌రా..
టీడీపీకి మ‌రో షాక్‌... బుద్ధా వెంక‌న్న జంపింగ్‌
ఫ‌స్ట్ వైఫ్ నీలిమపై అల్లు వార‌బ్బాయ్ క్లారిటీ
ఛాన్స్ కోసం: రాశీఖ‌న్నా హాట్ అందాల‌తో ఎలా టెంప్ట్ చేస్తుందో...
హ‌రీశ్‌రావు ఫ్యూచ‌ర్‌పై ఎన్ని ట్విస్టులో... ఉత్కంఠ‌కు తెర‌ప‌డేనా..
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.