ఇపుడిదే విషయంలో  తెలుగుదేశంపార్టీలో చర్చలు  జోరుగా జరుగుతోంది. అభివృద్ధి విషయంలో తమ శాఖలను పరిగెత్తించటంలో  వీరు ఎలా పనిచేశారన్నది వేరే విషయం. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఒంటికాలిపై లేచే  విషయంలో మాత్రం చాలామంది మంత్రులు అత్యుత్సాహం చూపేవాళ్ళు.

 

ఇటువంటి మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారు అనే విషయాన్ని టిడిపి వార్గాలు లెక్కలేసుకుంటున్నాయి. టిడిపి నేతల అంచనా ప్రకారం చాలామంది మంత్రులు ఓటమి బాటలోనే ఉన్నారట. సమస్యేమిటంటే పార్టీకి గాలుంటే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు. అంతేకానీ స్వొంత బలమంటూ లేనివారే ఎక్కువున్నారు మంత్రివర్గంలో.

 

ఉత్తరాంధ్రలోని మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, సుజయ కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయడులో ఒకిరికే గెలుపు అవకాశాలున్నాయట. మరి ఆ ఒక్కరూ ఎవరంటే సస్పెన్స్ అంటున్నారు.  ఉభయగోదావరి జిల్లాల్లో మంత్రులుగా యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, పితాని సత్యనారాయణ, జవహర్ ఉన్నారు. వీరిలో యనమల పోటీ చేయలేదు. కాబట్టి మిగిలిన ముగ్గరి గెలుపు కూడా కష్టమే అంటున్నారు.

 

రాజధాని జిల్లాల్లోని దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ల్లో దేవినేని తప్ప మిగిలిన వారికి గెలుపు అవకాశాలు లేవనే అంటున్నారు. దేవినేని విషయం మాత్రం ఎటూ చెప్పలేకున్నారు. కాకపోతే వైసిపి నేతలు మాత్రం దేవినేని ఓటమి ఖాయమనే అంటున్నారు. లోకేష్ విషయం ఏమీ చెప్పలేకున్నారు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని శిద్ధా రాఘవరావు, పి. నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో ముగ్గురికీ గెలిచే అవకాశాలు లేవనే అంటున్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్ధా ఒంగోలు ఎంపిగా పోటీ చేశారు.

 

చివరగా రాయలసీమ విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో పరిటాల సునీత విషయం ఎటూ చెప్పలేకపోతున్నారు. మరో మంత్రి కాలువ శ్రీనివాసుల ఓటమి ఖాయమట. కర్నూలులోని మంత్రులు కెఇ, భూమా అఖిలప్రియ ఓటమి ఖాయమైందనే అంటున్నారు. కడప ఎంపిగా పోటీ చేసిన మంత్రి ఆది నారాయణరెడ్డి గెలుపుపై ఎవరికీ నమ్మకం లేదు. చిత్తూరులో ఆదినారాయణరెడ్డి గెలుపు కూడా కష్టమే అంటున్నారు. మంత్రుల్లో ఇంత ఓడిపోతే ఇంతకన్నా పరువు తక్కువ ఇంకేమన్నా ఉందా ?  

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: