రాఘ‌వ లారెన్స్ కాంచ‌న -3 డివైడ్ టాక్‌తోనూ వ‌సూళ్ల విధ్వంసం క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. త‌మిళ్‌, తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోన్న కాంచ‌న బీ, సీ సెంట‌ర్ల‌లో వ‌సూళ్ల దుమ్ము దులుపుతోంది. విడుద‌ల అయిన వారం రోజుల్లో రూ.75 కోట్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా ఇప్పుడు మ‌రో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో ఈ యేడాది రిలీజ్ అయిన సినిమాల ప‌రంగా చూసుకుంటే కాంచ‌న 3 టాప్ -5 ప్లేస్‌లోకి వ‌చ్చేసింది.


ఇక మంగ‌ళ‌వారంతో కాంచ‌న 3 వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇక 2019లో సౌత్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన సినిమాల జాబితాలో కాంచ‌న -3 ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ర‌జ‌నీకాంత్ పేట‌, అజిత్ విశ్వాసం, ఎఫ్ -2, లూసీఫ‌ర్ తొలి నాలుగు ప్లేస్‌ల‌లో ఉన్నాయి. ఇక కాంచ‌న ఇప్ప‌టికే ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉండ‌గా..ఈ జోరు ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో ఎఫ్-2, లూసిఫర్ వ‌సూళ్లు క్రాస్ చేసి టాప్ -3 ప్లేస్‌లోకి వెళ్లిపోతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.


మ‌రో వైపు తెలుగులో జెర్సీ సినిమాతో పాటు క్రేజీ హాలీవుడ్ మూవీ ‘ఎవంజర్స్ ది ఎండ్ గేమ్’ ఉన్నప్పటికీ ఈ చిత్రం స్టాండర్డ్ గా రన్ అవుతుంది. కాంచ‌న దెబ్బ‌తో జెర్సీ వ‌సూళ్లు బాగా త‌గ్గిపోయాయి. ఇక చిత్ర‌ల‌హ‌రి, మ‌జిలీ సినిమాల ప‌రిస్థితి చెప్ప‌లేని విధంగా ఉంది. ఇక కాంచన-3 ఊహించని విజయం సాధించడంతో కాంచన-4 కూడా ఎనౌన్స్ చేశాడు లారెన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: