'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు" ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు ను తన అధికారం ఉపయోగించి మీడియా ప్రచారాన్ని ఆపేసి ఆయన కెసీఆర్ కోసం సాధించిన విజయాలకు ప్రచారం నిలిపివేశారనేది జనాంతికం. దాంతో హరీష్ కు లభించే కీర్తికి అడ్దుకట్టవేసిన సోషల్ మీడియాను కేసీఆర్ నిర్దేశించలేరు.  
Image result for harish rao chintamadaka
త‌న ప్రాధాన్య‌త‌ను ఎంత త‌గ్గిస్తున్నా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూనే, తానేమిటో చేత‌ల్లో చేసి చూపిస్తున్నారు తన్నీరు హ‌రీశ్ రావు. టీఆర్ఎస్ లో కేసీఆర్ త‌ర్వాత ఎవ‌ర‌న్న విష‌యం మీద పూర్తి స్పష్టత వ‌చ్చేయ‌ట‌మే కాదు హ‌రీశ్ ఇమేజ్ ను క్ర‌మ‌ప‌ద్ధ‌తి లో కేసీఆర్ అండ్ కో త‌గ్గిస్తున్న వేళ‌, ఆయ‌న్ను అభిమానించే వారు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో అధినేత మీద అసంతృప్తి త‌మనేత "ఇమేజ్ కు డ్యామేజ్ కాకూడ‌దు" అన్న‌ట్లుగా నిశ్శబ్ధంగానే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని ఒక కంట క‌నిపెడుతున్నారు హ‌రీశ్ అండ్ కో.
Image result for harish rao chintamadaka
ఇదిలా ఉంటే, త‌న ప్రాధాన్య‌త‌ను త‌గ్గించాల‌ని చూస్తున్న తీరుకు ఒక ప‌ట్టాన తలొగ్గ కుండా ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా త‌న స‌త్తా ఏమిటో చాటి చెబుతున్నారు హ‌రీశ్‌. తాజాగా మ‌రో సారి తానేమిటో చేత‌ల్లో చూపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌గ్రామ‌మైన "చింత‌మ‌డ‌క‌లో స్థానిక ఎన్నిక‌ను ఏక‌గ్రీవం" చేయ‌టం ద్వారా ఆయ‌న త‌న స‌త్తా ను ప్ర‌ద‌ర్శించారు.


ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఎన్నిక‌లు జ‌రగ‌ట‌మా? ఎన్నికలు జరిగితే ఎంత అవమానసస్మ్? తన స్వంత గ్రామంలో కూడా ఏకత్వం సాధించలేని ముఖ్యమంత్రి అంటారు కదా! ఆ ప్ర‌శ్న తెరమీద‌కు రాకుండా, నేపధ్యంలో మంత్రాంగాన్ని న‌డ‌ప‌టం ద్వారా, బ‌రిలో నిలిచిన వారు త‌మ‌కు తాముగా త‌ప్పుకునేలా చేసిన హ‌రీశ్‌, తానేమిటో మరో సారి నిరూపించారు. 
Image result for harish rao chintamadaka
స‌హ‌జంగా ఇలాంటి విష‌యాలు రాష్ట్ర వ్యాప్త ర‌చ్చ‌ చెసేస్తాయి ప్రతిపక్షాలు. కానీ, హ‌రీశ్ ఉంటే అలాంటి దృశ్యం కనిపించే అవ‌కాశ‌మే ఉండ‌దు. ఈ విష‌యాన్ని హ‌రీశ్ త‌న ప‌ని తీరుతో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. సిద్ధిపేట గ్రామీణ మండ‌లం "చింత‌మ‌డ‌క ఎంపీటీసీ స్థానాన్ని అన్ రిజ‌ర్వ‌డ్ మ‌హిళ‌ కు కేటాయించారు" ఈ ఎన్నిక‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థి తో పాటు, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు కూడా నామినేష‌న్లు వేశారు. 


సీఎం స్వగ్రామంలో ఎన్నిక‌ల జ‌ర‌గ‌ట‌మా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా, అలాంటి ప్రశ్నకు అవకాశమే లేకుండా, అధికార పార్టీ అభ్య‌ర్థి త‌ప్పించి, మిగిలిన వారు ఎవ‌రికి వారుగా త‌మ నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించు కోవ‌టంతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యం ఏక‌గ్రీవ‌మైంది. టీఆర్ఎస్ కు చెందిన 'రాందేని జ్యోతి ఎంపీటీసీ గా ఏకగ్రీవం గా ఎన్నిక‌య్యారు. అభ్య‌ర్థులు బ‌రిలో నుంచి త‌ప్పుకోవ‌టానికి హ‌రీశ్ న‌డిపిన మంత్రాంగ‌మే కీలకం అన్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదుగా? దటీజ్ హ‌రీశ్. 
Image result for harish rao chintamadaka
గతంలో గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో కాంప్ వేసి కేసీఆర్ కు గెలుపు సాధించిపెట్టి,  తాను ఎలాంటి ప్రచారం చేసుకోకుండా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించి న ఘనత హరీష్ రావు కు ఉంది. ప్రధాన మీడియా వదిలేసినా సోషల్ మీడియా ఆయన్ని కనిపెట్టుకోనే ఉంది. 


ఇంటర్ బోర్డ్ చేసిన నిర్వాకంతో కెసీఆర్ & కేటీఆర్ ప్రతిష్టకు గండిపడింది. ఇరవైకి పైగా విద్యార్ధులు ఆత్మ హత్య చేసుకోవటం రాష్ట్రానికే అప్రతిష్ట అంతే కాదు ఇంత వరకు కేసీఆర్ పాలనలో ఏ ప్రభుత్వ పర్ఫీక్ష కూడా సక్రమంగా నిర్వహించ బడిన దాఖలాలు లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: