సంచ‌ల‌నం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య‌కేసులో పోలీసులు తొలి చార్జిషీట్ దాఖ‌లు చేశారు. ఈ హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డేన‌ని తేల్చిన పోలీసులు.. కార్మిక సంఘం నేత బీఎన్‌రెడ్డి ప్ర‌మేయం కూడా ఉన్న‌ట్లు చార్జీషీట్‌లో దాఖ‌లు చేశారు. ఇటు జ‌యరాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రికి ఈ హ‌త్య‌లో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని నిర్దారిస్తూ ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చారు.


కేసు విచార‌ణ అధికారి, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కేఎస్ రామారావు దాదాపు 390 పేజీల అభియోగ ప‌త్రాలు నాంప‌ల్లి కోర్టులో దాఖ‌లు చేశారు. మొత్తం 70 మంది సాక్షుల‌ను విచారించిన పోలీసులు.. ప్ర‌ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌, సూర్య‌ప్ర‌సాద్‌, కిశోర్ విశాల్‌, నాగేశ్‌, అజంజిరెడ్డి, సుభాశ్‌రెడ్డిల‌పై చార్జీ షీట్ దాఖ‌లు చేశారు. 


జ‌న‌వ‌రి 31న చిగురుపాటి జ‌య‌రాం కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో త‌న కారుటోల అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఏపీ నుంచి జూబ్లీహిల్స్‌కు కేసు బ‌దిలీ అయిన త‌ర్వా కేసు ను ఏసీపీ కేఎస్ రామారావు టేక‌ప్ చేశారు. ఇప్ప‌టికే ఈ కేసులో 8మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందిలతుల‌కు స‌హ‌క‌రించిన ఇద్ద‌రు ఎన్స్‌స్పెక్ట‌ర్లు, ఒక ఏసీపీపై గ‌తంలోనే వేటుప‌డింది. 


జ‌య‌రాం హత్య కేసులో మొద‌టి నుంచి అనుమానం ఉన్న ఆయ‌న మేన‌కోడ‌లు శిఖాచౌద‌రికి ఇందులో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని పోలీసులు నిర్దారించారు. ప్ర‌దాన నిందితుడైన రాకేశ్‌రెడ్డికి, జ‌య‌రాంకు వ్యాపార విష‌యంలో ప‌రిచ‌యం ఏర్పడింద‌ని పోలీసులు తేల్చారు. ఈ క్ర‌మంలోనే శిఖా చౌద‌రికి రాకేశ్‌రెడ్డికి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడి.. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ మ‌ధ్య‌లోనే వీరి మ‌ధ్య విభేదాలు, గొడ‌వ‌లు త‌లెత్తాయి.


మ‌రోవైపు కార్మిక సంఘం నేత బీఎన్‌రెడ్డితో రాకేశ్‌రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా హ‌త్య‌తో సంబంధం ఉంద‌ని పోలీసులు అభియోగ ప‌త్రంలో పేర్కొన్నారు. సీసీ ఫుటేజీలు, కాల్‌డేటా ఆధారంగా బీఎన్‌రెడ్డి.. జ‌య‌రాం హ‌త్య‌కు రెండు రోజుల ముదు అంటే జ‌న‌వ‌రి 29, 30న రాకేశ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన‌ట్లు పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: