ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి. ఈ మూడు జిల్లాల్లో కలుపుకుని ఆరుగురు మంత్రులు టీడీపీ హయాంలో పనిచేశారు. మెజారిటీ సీట్లు దక్కాయి కాబట్టి టీడీపీ ఎక్కువ మంది మంత్రులను తీసుకుంది. అంతే కాకుండా రాజకీయ కారణాలు, సామాజిక వర్గ సమీకరణలు కలసి మంత్రుల సంఖ్య చివరికి  ఆరుకు పెరిగిపోయింది.  అయితే ఇపుడు వీరంతా మాజీలవుతున్నారు. రేపటి రోజున ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినా ఈ పరిస్థితి ఉంటుందని గట్టిగా చెప్ప్లేని పరిస్థితి ఉంది.


టీడీపీ అధికారంలోకి వస్తే ఈసారి  మూడు జిల్లాల మంత్రులను మారుస్తారని అంటున్నారు. కొత్త వారికి ఈ దఫా అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో అరకు నుంచి మళ్ళీ గెలిస్తే కిడారి శ్రావణ్ కుమార్ కి తప్పకుండా చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక సీనియర్ మంత్రులుగా ఇప్పటివరకూ ఉన్న అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు ఈ దఫా మంత్రి యోగం ఉండదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అలాగే బొబ్బిలి నుంచి సుజయ క్రిష్ణ రంగారావు కు బదులుగా అక్కడ కొత్త వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. శ్రీకాకుళంలో ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు గెలిచినా ఎవరో ఒకరికే మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు.


అదే వైసీపీ గెలిస్తే శ్రీకాకుళం  నుంచి ధర్మాన ప్రసాదరావుకు తొలి చాన్స్ లొనే మంత్రి యోగం ఉంటుందని అంటున్నారు. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ,  విశాఖ అర్బన్ జిల్లా  నుంచి  అవంతి శ్రీనివాసరావు,  రూరల్ జిల్లా నుంచి  బూడి  ముత్యాలనాయుడుకు అవకాశం ఇస్తారని, ఏజెన్సీలో ఐతే మంత్రి కిడారి మీద గెలిస్తే అరకు నుంచి శెట్టి ఫల్గుణుడికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఉత్తరాంధ్ర రాజకీయంగా పెను మార్పులకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మార్పుల వల్ల ఈ ప్రాంతాల అభివ్రుధ్ధి ఎలా జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: