విశాఖ అర్బన్ జిల్లాలో పెందుర్తి అసెంబ్లీ సీటు అందరికీ ఆసక్తి కలిగించింది. ఇక్కడ నుంచి మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్ధిగా వైసీపీ ఓ యువకుడిని నిలబెట్టింది. కాంగ్రెస్ లో చిన్న నాయకుడిగా ఉన్న అదీప్ రాజ్ వైసీపీలో చేరి పార్టీని ఓ స్థాయిలో ముందుకు తీసుకుపోయారు. బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన అదీప్ రాజ్ రాజకీయంగా కొత్త అయినా జనంలో విశేష అభిమానం సంపాదించుకున్నారు. ఓ విధంగా బండారు ని ఢీ కొట్టడం అంటే సాహసమే అయినా అదీప్ రాజ్ అందులో విజయం సాధించారనే అంటున్నారు.
 
 


అదీప్ రాజ్ జనంతో గత మూడేళ్ళుగా మమేకమయ్యారు. అదే ఆయనకు టికెట్ రావడానికి కారణమైంది. అదీప్ రాజ్ ని మార్చాలని ఎంతమంది చూసినా జగన్ తనకున్న సర్వేల ప్రకారం టికెట్ ఇచ్చేశారు. దానికి తగినట్లుగా అదీప్ కూదా దూసుకుపోయారు. జగన్ ఎన్నికల సభకు ఇసుక వేసే రాలనంతగా జనం వచ్చారు. ఆ రోజే అదీప్ గెలుస్తారని అంతా అనుకున్నారు. ఇక యువత ఓట్లతో పాటు, మహిళలు, సామాజిక వర్గం, వైసీపీ గాలి అన్నీ కలసి అదీప్ ని ఈసారి అసెంబ్లీకి పంపుతాయని భావిస్తున్నారు.
 
 


ఇక మాజీ మంత్రిగా ఉన్న బండారు 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో ప్రజారాజ్యం నుంచి ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన ఈసారి గెలిస్తే సెంటిమెంట్ ని తిరగరాసినట్లేనని అంటున్నారు. ఇక్కడ రెండవసారి గెల్చిన చరిత్ర లేదు. దానికి తోడు జనంలో వ్యతిరేకత కూడా బాగా ఎక్కువగా ఉంది. బండారు కుమారుడు అప్పలనాయుడు డీ ఫ్యాక్టో ఎమ్మెల్యేగా ఉన్నారని అంటారు. ఇక అభివ్రుద్ధి విషయంలో మైనస్ గా ఉండడం, సంక్షేమం కూడా పార్టీ ప్రాతిపదిక జరగడం వంటివి ఇబ్బందిగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండడం వల్ల వ్యూహ రచన బాగా చేస్తారని, చివరి నిముషంలోనైనా పరిస్థితి అనుకూలం చేసుకుని ఉంటారని అనుచరులు అంటున్నారు.. మొత్తానికి ఈ సీటు మీద టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ ఆశలు పెట్టుకోవడం విశేషం.
 


మరింత సమాచారం తెలుసుకోండి: