తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు, ఆయ‌న కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు డైరెక్ట్ షాక్ అనుకోవ‌చ్చు. ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు ఉద్యుక్తులైన‌ తెలంగాణకు చెందిన రైతులకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆర్మూర్‌ పసుపు రైతులకు చుక్కెదురైంది. మొత్తం 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలన అనంతరం 24 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన ఒకే ఒక్క రైతు నామినేషన్‌కు ఆమోదం తెలిపారు అధికారులు. ఈక్రమంలో కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి వారాణసి అధికారులపై ఫిర్యాదు చేయాలని రైతులు నిర్ణయించారు.


పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం ఇప్పటికే పోరాటం చేస్తున్న తెలంగాణ‌కు చెందిన రైతులు.. మోదీపై పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారణాసి చేరుకున్న రైతులు నామినేషన్ వేశారు. తెలంగాణ నుంచి 50 మంది రైతులు వార‌ణాసి వెళ్ల‌గా వారిలో కేవ‌లం 25 మందికే నామినేష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం క‌ల్పించారు. అయితే, వారిలో 24 మందివి తొల‌గించారు. 
ఇక.. వారణాసిలో మోడీ సహామ మొత్తం 119 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వివిధ కారణాలతో 89 నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల అనంతరం వారణాసి బరిలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: