అమెరికా.. ఈ ప్రపంచంలోని ప్రతి దేశాన్నీ శాసించాలనుకునే అగ్రరాజ్యం.. ప్రతి ఒక్కదేశం వ్యవహారాల్లోనూ వేలుపెట్టాలనుకునే దురహంకార దేశం. అమెరికా ధనబలానికి, సైనిక బలానికి, అంతర్జాతీయ సంబంధాల బలానికి దాదాపు అన్నిదేశాలు తలొగ్గుతున్నాయి. కానీ అగ్రరాజ్యం అయినంతమాత్రాన అందర్నీ లొంగతీసుకోవడం తమ వల్ల కాదని అమెరికాకు మరోసారి అర్థమయ్యేలా చెప్పిన దేశం వెనెజులా. 


కొన్ని నెలలుగా వెనెజువెలాలో రాజకీయ, భద్రతా పరిస్థితులు క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు జువాన్‌ గుయాడో తిరుగుబాటు ప్రయత్నాలు ప్రారంభించాడు. అతనికి అమెరికా మద్దతు తెలిపింది. ట్రంప్‌ కార్యవర్గం గుయాడోకు పూర్తి మద్దతుగా నిలిచింది. 

చివరి నిమిషంలో అమెరికా నుంచి గుయాడోకు అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు లభించలేదు. దీంతో ఈ తిరుగుబాటును.. అధ్యక్షుడు మదురోకు మద్దతుగా ఉన్న సైన్యం అణచి వేసింది. అమెరికా ఎత్తుగడలను పసిగట్టిన రష్యా కొన్ని వారాల క్రితమే తన సేనలను వెనెజువెలా పంపింది. 

ఫలితంగా సాక్షాత్తూ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తిరుగుబాటు విజయవంతం కాలేదు. దీంతో అమెరికాకు భంగపాటు తప్పలేదు. గతంలో క్యూబా కూడా ఇలాగే సంవత్సరాల తరబడి అమెరికాకు వ్యతిరేకంగా పోరాడి నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: