ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారు అని అడిగితే ఎక్కువ మంది చెప్పేమాట వైసీపీ.. మరి ఎందుకు ఈ టాక్ వచ్చింది. వైసీపీ గెలుస్తుందన్న ధీమా ఎందుకు వచ్చింది.. దీనికా కారణాలు వెదికితే.. ఈసారి వైసీపీ నాయకులంతా కింద నుంచి పై స్థాయి వరకూ సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. 


దాదాపు రెండేళ్ల ముందు నుంచే వైసీపీ కసరత్తు ప్రారంభించింది. పార్టీ తరపున బూత్ కమిటీలు వేసి.. జాగ్రత్తగా పార్టీని నిర్మించుకుంది.ఈ బూత్ కమిటీల ద్వారా స్థానికి ప్రజలతో టచ్ లో ఉండటం.. చేశారు. నవరత్నాలు వంచి స్కీములను బాగా ప్రచారం చేయడం. 

మరోవైపు రాజకీయంగా ఎత్తుగడలతో టీడీపీని ట్రాక్ లోకి లాగి. అటు బీజేపీతోనూ, ఇటు జనసేనతోనూ స్నేహం ఎదగనీయకుండా చేసి ఒంటరి పోరుకు దిగేలా పరిస్థితులు కల్పించడం.. గతంలోలా కాకుండా ఈసారి క్షేత్రస్థాయిలో నాయకులు కూడా చొరవతీసుకుని సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం. వంటి చర్యలతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది.  

మరోవైపు పోల్ మేనేజ్‌ మెంట్ లో కూడా వైసీపీ జాగ్రత్తపడింది. పోలింగ్ రోజు ఎవరెవరు ఓటింగ్ కు దూరంగా ఉన్నారో కనుక్కుని వారితో ఓటేయించడం.. అవసరమైన చోట డబ్బు  పంచడం.. ఎదుటి పార్టీ ఎత్తుగడలు కనిపెట్టి చెక్ పెట్టడం.. ఇలా.. చావో రేవో అన్నట్టు పోరాడటమే వైసీపీకి కలసిరానుందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: