భారత దేశంలో అక్రమ సంబంధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయా.. అంటే అవునంటోంది గ్లీడెన్ అనే యాప్. ఆండ్రాయిడ్ ఫోన్లలో పని చేసే ఈ యాప్ మహిళల్లో అక్రమ సంబధాలపై సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియాలో ఈ యాప్  వాడే ప్రతి పదిమందిలో నలుగురు తమ భర్తలను మోసం చేస్తున్నవారేనట.   


అసలు ఈ యాప్‌ ఉద్దేశ్యమే అక్రమ సంబంధాలను ప్రోత్సహించడం. ఈ యాప్ తో  మహిళలు, తమకు నచ్చిన అబ్బాయితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, వీడియో ఛాట్ కూడా చేయవచ్చు. ఈ యాప్ తమ వినియోగదారుల మనస్తత్వాలపై సర్వే చేయడం ద్వారా ఈ విషయాలు వెలుగు చూశాయి. 

అయితే ఈ లెక్క ఈ యాప్ వాడే ఆడవాళ్లలోనే సుమా. ఈ యాప్‌ను ఇండియాలో దాదాపు 5 లక్షల మంది వాడుతున్నారట. ఎక్కువ మంది బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ వంటి మెట్రో సిటీల్లో ఉండేవారే. మరి ఎందుకు ఇలా ఆడవారు ఇలాంటి యాప్ లు ఎందుకు వాడుతున్నారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. 

తమ భాగస్వామి పట్టించుకోకపోవడం.. సంసారంలో ధ్రిల్ లేకపోవడం.. సంసారం సజావుగా సాగకపోవడం వంటి కారణాలతో ఇలాంటి యాప్ లు వాడుతున్నారట మెట్రో మహిళలు. తెలియని వ్యక్తులతో సెక్స్ ఛాట్ చేస్తూ థ్రిల్ పొందుతున్నారట. ఈ యాప్ వినియోగిస్తున్నవారిలో ఎక్కువ మంది మధ్య వయస్సువారేనట. 



మరింత సమాచారం తెలుసుకోండి: