గెలుపు ఓటములు దైవాధీనాలు అని ఓ సామెత ఉంది. ఏపీలో పోటా పోటీగా ఎన్నికల పోరు జరిగిందన్నది అందరికీ తెలిసిందే. వైసీపీ టీడీపీ అక్కడ బలంగా ఢీ కొట్టాయి. పోలింగ్ అనంతరం మేమే గెలుస్తామని రెండు పార్టీలు ధీమాగా చెప్పుకుంటున్నాయి. ఈ విషయంలో మొదట వైసీపీ తమకు 120 కి తగ్గకుండా సీట్లు వస్తాయని లెక్క కూడా చెప్పేసింది.


మొదట్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, ఇలాంటి ఎన్నికలను జీవితంలో ఎపుడూ చూడలేదని చెబుతూ వచ్చిన చంద్రబాబు కొన్ని రోజుల నుంచి మాత్రం టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు. లేటెస్ట్ గా ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన బాబు నూటికి వేయి శాతం టీడీపీ గెలుస్తుంది, ఇందులో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఒక్కసారిగా పెరిగిన బాబు ధీమా వెనక కారణాలు ఏంటి.


అది కనుక ఆలొచిస్తే వెనక లగడపాటి రాజగోపాల్ సర్వే ఉందని అంటున్నారు. లగడపాటి తన సర్వేను బయట పెట్టకపోయినా చంద్రబాబుకు ఇచ్చారని చెబుతున్నారు. ఆ సర్వే  ప్రకారం మళ్ళీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తేలిందట. మహిళా ఓటింగు టీడీపీకి ప్లస్ అయిందని లగడపాటి పేర్కొన్నట్లు కూడా వెల్లడిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను పట్టుకునే బాబు ఇపుడు అతి ధీమాగా కనిపిస్తున్నారుట. ఇవన్నీ సరే కానీ ఇదే లగడపాటి తెలంగాణా ఎన్నికల విషయంలో పప్పులో కాలేశారన్న సంగతిని తెలుగు తమ్ముళ్ళు మరవద్దు అంటున్నారంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: