ప్రభుత్వం కంటే అధికార యంత్రాంగం  నిశ్శబ్ధంగా  ఫొనీ తుఫాను ప్రమాద సమయంలో  సకాలానికే స్పందించింది.  తమిళనాడు రాజధాని చెన్నైకి సుదూరంగా బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన "ఈ తుఫాను కేంద్రం" గుర్తించి ముందుగనే అన్నింటికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టమైతే ఉండదనే వాదన వినిపిస్తోంది. 
Image result for poni tufan effect on AP
అయితే సముద్రతీర ప్రాంత ఆంద్ర ప్రదేశ్ జిల్లాలు అది కూడా శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఒక  మోస్తరు తుఫాను ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎవరి కోసమూ ఎదురు చూడకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం  సమయానికి ముందే రంగంలోకి దిగిపోయారు. 
Image result for poni tufan effect on AP
తుఫానుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ జిల్లాల అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. ఇంకేముంది ఇప్పటికే తుఫాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు బుధవారం మధ్యాహ్నానికే నాలుగు "ఎన్డీఆర్ఎఫ్-నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ (జాతీయ విపత్తు నివారక బృందాలు)" చేరి పోయాయి.  ఆదనంగా మరో రెండు బృందాలు కూడా దారిలో ఉన్నాయి. నిజంగా.... ఇదీ అప్రమత్తత అంటే—ప్రమాదం ముందే ఊహించి దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమవటం 
Image result for poni tufan effect on AP
సార్వత్రిక ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరిగిన తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లో “మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్” అమలులో ఉండటం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి  రాగానే, రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారిపోవటం సహజం. అప్పటిదాకా చక్రం తిప్పిన టీడీపీ అధినేత ఏపీ, సీఎం, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అధికారిక సమీక్షలు నిర్వహించ కూడని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఎలాంటి అవకాశం ఉండదు. 


అత్యవసర పరిస్థితులు, ప్రకృతి ప్రకోపం అంటే తుఫానులు - వరదలు - తాగు నీటి ఎద్దడి - శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు నెలకొంటే తప్ప రివ్యూలు చేసుకునే వీలు ఈ విపత్కర పరిస్థితుల్లో  చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చింది.


ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తత ఇలానే ముందుగానే ఉండాలి. వైపరీత్యం జరిగిపోయిన తర్వాత ఆ విలయం చూసి వేదన చెందటం కాదు.  తగినంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండగా... ముందస్తు జాగ్రత్తలతోనే ప్రకృతి ప్రకోపం నుండి ఉద్భవించే నష్టాల నివారణకు రంగం సిద్ధం చేయాలి. అదే ప్రభుత్వ అధికారుల అధినేత ఎల్వి సుబ్రమణ్యం నిశ్శబ్ధంగా చేసేశారు. 
Related image
మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు, తాను సమీక్షలు చేయకుంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఏమై పోవాలి? అసలు చంద్రబాబు సమీక్షలు చేసిన కాలంలో ఈ తరహా అప్రమత్తత ఎప్పుడైనా కనిపించిందా?  అంతా మునిగిపోయిన తర్వాత ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దించేవారు. బాధితు లకు అండ గా నిలిచేందు కు అధికారులకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి తుఫాను ప్రభావిత ప్రాతాల్లోనే సమీక్షలు పర్యటనలు పెట్టేవారు. 


నష్టం సంపూర్ణం అయ్యాక తీరికగా బాధితులను ఆదుకునే చర్యలు మొదలెట్టినా ఆ సమయం అంతా కూడా పచ్చ మీడియా పిచ్చి ప్రచారానికే సరిపోయేది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధిరులు రంగంలోకి దిగి చెయ్యగలిగిన పనులు విధానాల ప్రకారం ముంగించటానికి ముందుకు కదలటం జరిగింది. 
ప్రస్తుత తరుణంలో అధికార యంత్రాంగం నష్టం జరిగిన తర్వాత కాకుండా, ముందుగా ఏ ప్రచార పటాటోపం లేకుండా రంగంలోకి దిగి నష్టమే జరగకుండా చర్యలు చేపట్టేసింది. అరా కొరా నష్టం జరిగనున్న సందర్భాలుంటే వాటి నివారణకు తగిన చర్యలు తీసున్నారు. అదే చంద్రబాబైతే కుడిఏడమల డాల్ కత్తులు మెరయగ రీతిలో అంతా హంగామా ఖర్చు దుబారాతో కూడుకున్న పని. 

దీన్ని మాత్రమే నిజమైన అప్రమత్తత లేదా ముందు జాగ్రత్త అంటారు. మరి ఈ విషయాన్ని ప్రచార పటాటోపం కోసం ప్రాకులాడే బాబు లాంటి నేతలకు మింగుడుపడక – ఆ నాలుగు జిల్లాలోనైనా ఎన్నికల కోడ్ అమలు ఎత్తివేయాలని కేంద్రంతో  కీచులాటలు ప్రారంభించారు. 

Image result for poni cyclone and CS LVS in AP

మరింత సమాచారం తెలుసుకోండి: