ఈమధ్య భారీగా పట్టుబడిన శ్రీవారి బంగారం వ్యవహారంపై చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరుగుతున్నట్లే ఉంది. పట్టుబడ్డ బంగారంపై నిగ్గు తేల్చేందుకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఓ కమిటీ వేయటంపై చంద్రబాబు మండిపోతున్నారు. కమిటి అవసరం ఏమిటంటూ ఎగిరెగిరిపడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తుంటే బంగారం తరలింపుపై చంద్రబాబు పాత్రపై అనుమానాలు పెరిగిపోతోంది.

 

పోయిన నెల 17వ తేదీన తమిళనాడు నుండి ఏపికి వస్తున్న ఓ వాహనంలో రూ 400 కోట్ల విలువైన 1381 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే.  అప్పట్లో ఆ వ్యవహారం ఏపిలో సంచలనమైంది. ఎందుకంటే, సరైన పత్రాలు లేకుండానే వందల కోట్ల విలువైన బంగారం ఏపిలోకి తరలించటమే కారణం.

 

సరే పట్టుబడ్డ బంగారం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుదన్నారు. బ్యాంకు నుండి టిటిడికి తరలిస్తున్నట్లు మళ్ళీ చెప్పారు. అయితే ఇటు బ్యాంకు అధికారులు కానీ అటు టిటిడి ఉన్నతాధికారులు కానీ ఎవరూ చాలా రోజులు నోరిప్పలేదు. దాంతో అనుమానాలు పెరిగిపోయాయి.  

 

బంగారం పట్టుబడకుండా ఉండుంటే కడప జిల్లాలోని ఓ ప్రముఖడి దగ్గరకు చేరుకునేట్లు ప్లాన్ చేశారట. ఒకవేళ పట్టుబడితే మాత్రం అదంతా టిటిడి బంగారంగా చెప్పేసి చేతులు దులుపుకోవాలనే ప్లాన్ ప్రకారమే చెన్నై నుండి బంగారం తరలింపు మొదలుపెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఎల్వీ వెంటనే స్పందించి సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తో విచారణ జరిపించారు.

 

మూడు రోజుల పాటు విచారణ జరిపిన సింగ్ నివేదికలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో బంగారం వెనకున్న గూడుపుఠాణీని వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని వేశారు. కమిటీ ఆమోదం కోసమే ఫైలును చంద్రబాబుకు పంపారు. ఆ విషయంపైనే చంద్రబాబు సీఎస్ పై మండిపోతున్నారు. బంగారం విషయంలో ఎల్వీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారట.

 

అసలు తనకు చెప్పకుండానే కమిటీ ఎలా వేస్తారంటూ మండిపోయారు. టిటిడి ఈవో ఎక్కడా తప్పు చేయలేదని సర్టిఫికేట్ ఇచ్చేశారు. విచిత్రమేమిటంటే ఈవో తప్పు చేశారని ఇప్పటి వరకూ ఎవరు చెప్పకుండానే చంద్రబాబు సర్టిఫికేట్ ఇచ్చేయటం ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: