400 ఏళ్ల చరిత్ర  హైదరాబాద్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్‌. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత, కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అయితే అప్పట్లో ఈ నిర్మాణానికి ఎలాంటి అవాంతరాలు..ఇబ్బందులు లేకున్నా గత కొంత కాలంగా చార్మినార్ చుట్టూ ఎన్నో ఉపద్రవాలు చుట్టుముడుతున్నాయి. 


ఆ మద్య చార్మినార్ ఎక్కి కొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారని..ఇక్కడ కొంత కాలం నిషేదాన్ని అమలు చేశారు.  అందులోని ఒక మినార్ కు సంబంధించిన కట్టడంలోంచి చిన్న ముక్కలు రాలాయని మరమ్మత్తులు చేస్తున్నారు.  కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది.


ఈ విధంగా శుభ్రం చేసి, రంగు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది. 16వ శతాబ్దికి చెందిన చార్మినార్ కు మరమ్మతులు చేస్తుండగా ఓ భాగం కూలుతూ వచ్చింది. అందుకు గల కారణమేమిటనేది తెలియదు. ఆర్కియోలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గురువారం దాన్ని పరిశీలిస్తారని సమాచారం. ఈ ఘటనతో చార్మినార్ వద్ద ఉండే చిరువ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 


ఇక 400 ఏళ్ల చరిత్ర  హైదరాబాద్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్‌. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత, కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి ఐదో సుల్తాన్ అయిన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు.  అంటే చార్మినార్ నిర్మించి సుమారు 428 సంవత్సరాలైంది. ఈ నిర్మాణానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: