తెలంగాణ  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపు నుంచి విజయం సాధించిన పలువురు నేతలు వరుసగా టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు భట్టి విక్రమార్క..ఈ సమయంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించాలని భట్టి వ్యూహరచన చేస్తున్నారు.  ఓ వైపు పార్టీ ఫిరాయింపు దారుల తీరుపై విమర్శలు చేస్తూనే..మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే నాలుగు రోజులుగా మండుటెండల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయనపై ఎండ తీవ్రత ఎంతో పడింది.

బుధవారం వడదెబ్బకు గురయ్యారు. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనను ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భట్టి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: