ఒక పక్క టీడీపీ నాయకుడు మరియు టీడీపీ నాయకులు ఎన్నికల గిరించి నానా హంగామా చేస్తుంటే, ప్రతి పక్ష నాయకుడు మాత్రం కూల్ గా ఉన్నాడు. దీనితో టీడీపీ ఓటమి ఖాయమని సర్వత్రా వినిపిస్తుంది. మొన్నటివరకు మేకపోతు గాంభీర్యం ఒలకపోసిన బాబు, ఇప్పుడు ఓటమికి మానసికంగా సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. తనను కలవడానికి వచ్చిన నేతలతో ఇదే విషయంపై ఎక్కువగా మాట్లాడుతున్నారట బాబు. మనం అప్పుడు అలా చేసి ఉండకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు అంటూ పాత తప్పుల్ని తాపీగా నెమరవేసుకుంటున్నారు బాబు.


ఇంతకీ ఈ ఎన్నికల వేళ చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం. అవును.. కమలనాధులకు విడాకులు ఇచ్చి, ఐదేళ్లు తాము చేసిన తప్పుల్ని కమలం పార్టీపై నెట్టేసి మరోసారి గెలిచేద్దామని బాబు మాస్టర్ ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా ఏడాదిగా ఆ ప్లాన్ ను అనుకూల మీడియా సహాయంతో అమలుపరుస్తూ వచ్చారు. కానీ ఈసారి బాబు మంత్రాంగం, అనుకూల మీడియా ప్రచారం పనిచేయలేదు.


వీటి కంటే సోషల్ మీడియా బాగా పనిచేసింది. జగన్ పాదయాత్ర అంతకంటే బాగా పనిచేసింది. వీటితో పాటు బాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర మీడియా సంస్థలు, బీజేపీ నేతలు కూడా అతడి బండారాన్ని బట్టబయలు చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీపై బాబు ఎన్ని విమర్శలు చేసినా, హద్దుమీరి కామెంట్స్ చేసినా అవి ప్రజలకు రుచించలేదు. కేవలం మరోసారి గెలవడం కోసమే బాబు, బీజేపీ బూచిని చూపిస్తున్నారని ప్రజలు గ్రహించారు. తన నాటకాన్ని ప్రజలు ఎప్పుడో గ్రహించారనే విషయాన్ని బాబు ఇప్పుడు గ్రహించారు. అప్పటి మాస్టర్ ప్లాన్ తుస్సుమనిందని సన్నిహితుల వద్ద బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: