ప్రపంచమంతా టెక్నాలజీ మయం..బస్సు టిక్కెట్టు నుంచి ఎయిర్ బస్సు ప్రయాణం వరకూ..సినిమా టిక్కెట్టు నుండి పరీక్ష హాల్ టిక్కెట్టు వరకూ సర్వం తానై ప్రపంచాన్ని నడిపిస్తుంది టెక్నాలజీ. 


నాణానికి రెండో వైపు..దేవుడు ఉన్నపుడు దెయ్యం తప్పక ఉంటాయన్నట్లుగా.. ఈ అద్భుత సాంకేతిక ప్రంపంచానికి పెద్ద చీడపురుగు హ్యాకింగ్.  ఇక హ్యకింగ్ అంటే మన ప్రమేయం లేకుండా..వారి యొక్క అతితెలివితేటలతో మన సమాచారాన్ని దొంగిలించడం..దొంగిలించిన సమాచారాన్ని ఉపయోగించి మనల్నే బెదిరించడం..డబ్బు, ప్రయోజనాలను పిండుకోవడం. 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల విద్యుత్ విభాగ వెబ్ సైట్లు అంతర్జాతీయ హ్యాకర్స్ హ్యాక్ చేసి రూ.35 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారట.  అయితే ఆ సమాచారం మొత్తం విద్యుత్ విభాగం వద్ద బ్యాకప్ ఉండటం వల్ల ఎటువంటి ముప్ప లేదంటున్నారు.


అయితే హ్యాకర్లు దొంగిలించిన సమాచారంతో వినియోగదారులయిన మన సమాచారం, మన ఆధార్ సమాచారం ఏమయినా ఉందా? దాని వలన మనకే మయినా ముప్ప ఉందా అనేది తెలియరాలేదింకా. హైదరాబాద్ పోలీసులు కేసు ను సైబర్ క్రైమ్ గా నమోదా చేసి విచారణ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: