ఈవీఎం ల గురించి చంద్రబాబు ఎప్పుడు లేని విధంగా నానా హంగామా చేస్తున్నారు. చివరికి ఈ హడావిడి పార్టీ నేతలకు కూడా నచ్చడం లేదు. అయితే గెలిస్తే ప్రత్యర్థులు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు తనకే పట్టం కట్టారని.. ఈవీఎం ట్యాంపరింగ్ జరగకుండా తాను అడ్డుకున్నానని చంద్రబాబు ప్రచారం చేసుకునే చాన్స్ ఉంటుందట. అయితే ఓడితే మాత్రం ప్లాన్ బి అమలు చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోయారట.. ప్రజల తీర్పు తనకే అనుకూలంగా ఇచ్చారని.. కానీ ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారని యాగీ చేయొచ్చు.


కొన్ని నెలల పాటూ ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడిపేయవచ్చు అని చంద్రబాబు ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే ఈవీఎంలపై అనేక అనుమానాలను ముందు నుంచే పకడ్బందీగా వ్యాపింపచేస్తున్నట్టు అర్థమవుతోంది. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా అధినేత బాటలోనే నడిచాడు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను చూసి సంతృప్తి వ్యక్తం చేశాడు.


వేసిన సీలును కూడా పరిశీలించి ఏమైనా మార్చారా అని సందేహాలు వ్యక్తం చేశాడట... ఇలా టీడీపీ అభ్యర్థులందరూ ప్రజల బలం కంటే ఈవీఎంలంటేనే ఇప్పుడు హడలిచస్తున్నారు. ఇలా పచ్చ బ్యాచ్ మొత్తం ఓటమి భయంతో ఇలా ఈవీఎంలు - ట్యాంపరింగ్ బాట పట్టారు. ఓడిపోతే అదే నెపాన్ని వేసి ప్రజల తీర్పును అపహాస్యం చేసేందుకు రెడీ అయ్యారు. గెలిస్తే తమదే క్రెడిట్ అని.. ఓడితే మాత్రం వైసీపీ విజయాన్ని తక్కువ చేసి చూపడానికి రెడీ అయ్యారు. మరి ఇంతలా అనుమానాలున్నా నేతలు ఈవీఎం ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను ఈసీ అనుమతి తీసుకొని యాక్సెస్ చేసుకొని 24గంటలు వాచ్ చేస్తే సరిపోతుంది కదా అని సెటైర్లు  పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: