ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌భ్యుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స‌మీక్ష‌ల పేరుతో ఎన్నిక‌ల నిబంధ‌న‌ల విష‌యంలో దూకుడు ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని తెలిసినా...ఈసీనే త‌ప్పు ప‌డుతూ సోమిరెడ్డి మ‌రింత హంగామా చేస్తున్నారు. ఈ ప్ర‌హ‌స‌నంపై తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, సీఎం నుంచి మంత్రుల వరకు సమీక్షలపై నానాయాగి చేస్తున్నారని మండిప‌డ్డారు. సమీక్షలను ఎవరో అడ్డుకుంటున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.


అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సమీక్షలు చేయలేదని కాకాణి సూటిగా ప్ర‌శ్నించారు. ``అవినీతిని సీఎస్ అడ్డుకుంటే మంత్రులు,ముఖ్యమంత్రి యాగి చేస్తున్నారు. ఎక్కడ అవినీతికి సంభందించి ఆధారాలు దొరుకుతాయో వాటిని తుడిచిపెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఐదు సంవత్సరాలు సమస్యలపై దృష్టి పెట్టకుండా ఈరోజు మాత్రం మీకున్న అదికారాల గురించి మాట్లాడుతున్నారా? మ‌ంత్రి సోమిరెడ్డి వెళ్లి సమీక్ష చేద్దామని వెళ్తే అదికారులు రాకపోతే మూడు గంటలసేపు డిస్కోడాన్స్ చేశాడు. మళ్లీ తర్వాత రోజు సైతం ప్రయత్నిస్తే అధికారులు రాలేదు.అయినా సిగ్గులేకుండా ఇంకా మాట్లాడుతున్నారు`` అంటూ విరుచుకుప‌డ్డారు 


ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులు, టీడీపీ నేత‌లు అధికారంలో ఉన్న‌పుడు ఏం చేశార‌ని కాకాణి ప్ర‌శ్నించారు. ``రైతుల రుణాలను ఎందుకు మాఫి చేయలేదు?  దీంతో రైతు రుణభారాన్ని రెట్టింపు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదు. స్వామినాధన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదు? `` అని నిల‌దీశారు. ``సోమిరెడ్డి నీవు వ్యవసాయమంత్రివి కాదు కిరాయిమంత్రివి. అత్యంత అసమర్ద వ్యవసాయశాఖమంత్రిగా నిలిచిన వ్యక్తి సోమిరెడ్డి. పంటలపై,గిట్టుబాటు ధరలపై ఏమాత్రం అవగాహన లేదు. రైతుభీమా,ఇన్ పుట్ సబ్సిడిలు,పంటల భీమా,విత్తనాల రేట్లపై అవగాహనలేదు. రైతులకు నాలుగు, ఐదు రుణమాఫి వాయిదాలను ఎగ్గొట్టినదానికి సహకరించిన వ్యక్తివి. పొలంలోకి వెళ్లి రైతుల సమస్యల గురించి మాట్లాడిన పరిస్దితి లేదు గాని మీడియా మైకుల ముందు మాత్రం పెద్ద ఫోజులు కొడుతూ మాట్లాడతావు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎవర్ని తిట్టమంటే వారిని తిట్టడం తప్పితే నీవు చేసింది ఏమిలేదు. నీకు అసలు వ్యవసాయశాఖపై అవగాహనేలేదు. అతి తక్కువ ఆదాయం ఉన్న రాష్ర్టాల్లో ఏపిని నిలిపారు.ఇది నాబార్డ్ నివేదికలో ఉంది. అవినీతి,అప్పుల్లో నంబర్ 1 గా నిలిపిన ఘనత మీదే. అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనబడలేదా? ఈరోజు సమీక్ష జరగాలి అంటే మీరు చేసిన అవినీతిపై అక్రమాలపై సమీక్షలు జరగాలి. సోమిరెడ్డి అంటే సోదిరెడ్డి, సోంబేరి రెడ్డి ,సోమరి రెడ్డి అనే చాలా బిరుదులు ఉన్నాయి. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకుందామని చివర్లో సచివాలయంకు వెళ్తున్నారు.`` అంటూ తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: