వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజా అన్నది అందరికీ తెలిసిందే. ఆమె మాటల తూటాలు ప్రత్యర్ధులకు సూటిగా గుండెల్లోనే తాకుతాయి. రోజా అసెంబ్లీలో ఉంటే రచ్చ అని ఆమెను అప్పట్లో టీడీపీ సర్కార్ బయటకు పంపించేసిన సంగతి తెలిసిందే. అంటే రోజా మార్క్ ఎలాంటిదో అర్ధమ‌వుతుంది. అలాంటి రోజా ఇపుడు ఒక్కసారిగా చేంజ్ అయిపోయారా.


ఆమె సైలెంట్ వెనక కారణాలు ఏంటి, నిజానికి జగన్ సీఎం అవుతారని పోలింగ్ ముందు రోజు వరకూ పదే పదే చెప్పిన రోజా పోలింగ్ ముగిసిన తరువాత నోరు విప్పడంలేదు. మరో వైపు వైసీపీ సీనియర్ నాయకులంతా మాట్లాడుతున్నారు. టీడీపీని అటాక్ చేస్తున్నారు. అయితే రోజా మాత్రం పెదవి విప్పడంలేదు. రీజనేంటి అంటే పెద్ద విషయమే వుందంటున్నారు.


చిత్తూరు జిల్లా నగరిలో రోజా పోటీ చేశారు. నామినేషన్ వేసిన కొన్ని రోజుల వరకూ రోజాది గ్రాండ్ విక్టరీ అని అంతా భావించారు. అలాగే ట్రెండ్ కూడా ఉంది. తీరా పోలింగ్ దగ్గర పడిన తరువాత కానీ రోజాకు సీన్ అర్ధం కాలేదట. ఆమెకు సొంత పార్టీ వైసీపీ నేతలే ఓడించేందుకు ట్రై చేశారని, సహాయ నిరాకర‌ణ చేశారని ఈ ఫైర్ బ్రాండ్ మండిపోతున్నారుట. 


పార్టీలో హై హ్యాండ్ గా ఉండే రోజా కనుక బంపర్ మెజారిటీతో గెలిస్తే రేపటి రోజున జగన్ క్యాబినెట్ బెర్తుల్లో తమకు పోటీ వస్తారని వైసీపీ బిగ్ షాట్స్ ఆమెను కావాలని ఓడించేందుకు ట్రై చేశారని జిల్లాలో  టాక్ నడుస్తోందట. రోజాకు కూడా పోలింగ్ సరళి చూసిన తరువాత అంతా అర్ధమైపోయిందట. దాంతోనే ఆమె ఇపుడు మౌనంగా కోపంగా ఉంటున్నారని చెబుతున్నారు. రోజా గెలిస్తే అతి స్వల్ప మెజారిటీతో బయటపడతారని, లేకపోతే లేదని ఇపుడు అంటున్నారు. మరి రోజా మౌనం వెనక కధ అధినాయకత్వానికి  చేరిందా లేదా అన్నది తెలియడంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: