పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశగా 190 కిలోమీటర్ల దూరంలో ఫొణి తుఫాన్‌ కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ ఒడిస్సా తీరం వైపు దూసుకెళ్తోంది. ఒడిశాలోని పూరీలో రేపు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.  తెలుగు రాష్ట్రాలనే కాదు ఒడిషాను సైతం వణికిస్తున్న ఫాని తుఫాన్ ఉధృతం అవుతుంది. 

రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో 25 సెం.మీ ల వర్షపాతం నమోదయ్యియే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖవారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రానికి వర్షంతోపాటు గాలుల వేగం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు.  ఆహారం, త్రాగు నీరు, విద్యుత్ స్తంబాలను సిద్దం చేసిన ప్రభుత్వం. రాత్రి 7 నుంచి రేపు ఉ.7 గం. ల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు అధికారులు.   

రేపు ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధాన రహదారుల మూసివేస్తామని తెలియజేశారు ఆర్టీజీ సీఈఓ. తీరం దాటే సమయంలో గంటకు 170 కిలో మీటర్ల వేగం తో గాలులు వీస్తాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.  ఇచ్చాపురం, కవిటి, కంచిలి, మందస, నందిగాం, పలాస, సోంపేట, సంతబొమ్మాళి ఊళ్లను అలర్ట్ చేసిన అధికారులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: