అవును నెటిజన్లలో ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సోషల్ నెటవర్క్  అంటే ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ లాంటి వాటిల్లో ఖాతాలు ఓపెన్ చేయాలంటే కనీస వయస్సుంటుంది. ట్విట్టర్లో ఖాతా ఉండాలంటే కనీస వయస్సు 13 ఏళ్ళు నిండుండాలి. నారా దేవాన్ష్ అంటే ఎవరో ప్రత్యేకించి చంద్రబాబునాయడు మనవడని చెప్పక్కర్లేదు. మహా ఉంటే దేవాన్ష్ కు ఓ ఐదేళ్ళుంటుందేమో. అలాంటిది బుడతడి పేరుతో కూడా ట్విట్టర్లో ఓ అధికారిక ఖాతానే ఉంది.

 

నిజానికి దేవాన్ష్ పేరుతో అధికారికంగా ఖాతా ఉండటమంటే నిబంధనలను ఉల్లంఘించటమే. ఎంతోమంది పిల్లలు తమ వయస్సును తప్పుగా చెప్పి ఖాతా ఓపెన్ చేసిన వాళ్ళు లేరా అంటే ఉండొచ్చు. కానీ వాళ్ళ వయస్సెంతో కనీసం పక్కింట్లో వాళ్ళకు కూడా తెలీదు. కానీ దేవాన్ష్ పరిస్ధితి అలాకాదు.

 

ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు, నారా లోకేష్ దేవాన్ష్ ను ఓ సెలబ్రిటీగా ప్రమోట్ చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తమ మనవళ్ళని, లేదా కుటుంబం సభ్యులను ప్రమోట్ చేసిన దాఖలాల్లేవు చంద్రబాబు లాగ. అందుకని దేవాన్ష్ పేరుతో అధికారికంగా ట్విట్టర్లో ఖాతా ఉండటం ఇపుడు నెటిజన్ల మధ్యలో వైరల్ గా మారింది. ఐదేళ్ళ వయస్సున దేవాన్ష్ కు ట్విట్టర్లో అధికారిక ఖాతా ఉండటమంటే నిబంధనలను ఉల్లంఘించటం క్రిందే లెక్క. ఐటి శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ కు కొడుకు పేరుతో అధికారిక ఖాతా ఉండకూడదని కూడా తెలీదా ? అంటూ నెటిజన్లు ఓ రేంజిలో ఆడుకుంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: