ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో తెలంగాణలో ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.   మొదటి నుంచి ఇంటర్ ఫలితాలపై సరైన క్లారిటీ లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది.  మొత్తాని ఇంటి ఫలితాలు వెలువడ్డ రోజు నుంచి విమర్శలు మొదలయ్యాయి.  ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాసిన విద్యార్తులు సింగిల్ డిజిట్, కొంత మంది విద్యార్థులకు ఆప్ సెంట్..ఇలా పిచ్చి పిచ్చిగా వెబ్ సైట్లలో దర్శనమిచ్చాయి.  దాంతో షాక్ తిన్న విద్యార్థులు తామెంతో కష్టపడి రాస్తే ఇలాంటి మార్కులు రావడం ఏంటని ప్రశ్నించడం మొదలు పెట్టారు. 

వీరికి తోడు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు వద్ద నిరసనలు, ధర్నాలు చేశారు.దాంతో సీఎం కేసీఆర్ జోక్యంచేసుకొని ఇంటర్ బోర్డు పై సీరియస్ అయ్యారు. దీనిపై త్రిసభ్య కమిటీ వేశారు..అయితే కమిటీవారు ఇంటర్ బోర్డు, గ్లోబరినా సంస్థల పూర్తి వైఫల్యమే రిజల్ట్ కి కారణం అని తేల్చారు.  దాంతో రీ వేరిఫికేషన్, కరెక్షన్ చేపట్టారు.  అయినా కూడా ఇంటర్ మంటలు ఆరడం లేదు. తాజాగా ఇప్పుడు పదో తరగతి మూల్యాంకనంలో తప్పులు జరిగాయని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రాజీవ్ స్పష్టం చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 523 పేపర్లను రివాల్యూయేషన్ చేయించామని, దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన హెచ్‌ఎంను సస్పెండ్ చేశామని ఆయన ప్రకటించారు. అంతే కాదు దీనికి బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వరంగల్  డీఈవోకు కూడా లేఖలు రాశామని రాజీవ్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: