గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫోని తుఫాన్ వల్ల ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు  ప్రజలు.  తాజాగా  ఫోని తుఫానుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను నష్ట నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలపై గురువారం ఉన్నాతాధికారులతో సమీక్ష జరిపారాయన. ప్రధాని సమీక్షాసమావేశానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


మోదీ నిర్వహించిన హైలెవల్ సమీక్షకు కేబినెట్ సెక్రటరీ, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రధాని అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శి, ఐఎండీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్‌డీఎంఏ, పీఎంఓకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఫణి తుఫాన్ గమనం ఎలా ఉంది? ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? సహాయకచర్యలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తుఫాన్ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? వంటి అంశాలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. 


అదే విధంగా  జనరేటర్లు, మంచినీరు వంటి వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాల్లోని అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సహాయకచర్యలను పర్యవేక్షిస్తూ ఉండాలని కేంద్రంలోని సీనియర్ అధికారులకు మోదీ సూచించారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.  తుఫాన్‌ వల్ల ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అధికారులు సహాయక చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశించించారు. తుఫాన్‌ ప్రభావిత రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: