సాధారణంగా మన పురాణాల్లో మహాశివుడికి మూడో నేత్రం ఉందని అది తెరిస్తే ప్రపంచం నాశనం అవుతుందని విన్నాం.  పురాణాలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంటాయి.  ఇక శివుడు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన మెడలో ధరించే నాగరాజు.  ప్రపంచంలో నాగు పాము అంటే ఎంత భయపడతారో అంతే పూజిస్తారు.  ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే వింతలన్నీ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. 

ఎలాంటి చిన్న వింత సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  తాజాగా ఒక పాముకి రెండు కళ్లు కాదు మూడో కన్ను కూడా ఉండటం.. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  వివరాల్లోకి వెళితే..ఉత్తర ఆస్ట్రేలియా డార్విన్ సమీపంలోని అర్న్‌హెమ్ హైవేపై ఈ అరుదైన కొండచిలువను ఆ మధ్య వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు.

మొదట రెండు కళ్లతోనే ఈ పైథాన్ చూస్తుందని భావించిన వారు ఒక్కసారే షాక్ తిన్నారు..ఆ పైతాన్ కి మూడో కన్ను కూడా ఉంది.  మొదట ఇది నమ్మలేదు..ఈ విషయాన్ని వారు ఎక్స్‌రే తీసి తెలుసుకోగలిగారు. మరో ట్విస్ట్ ఏంటంటే పైథాన్‌ తలలో రెండు పుర్రెలు లేవని, ఒకే పుర్రెపై మూడు కళ్లు ఉన్నట్లు తేలింది. సహజసిద్దమైన జన్యుమ్యుటేషన్ వల్ల ఇలా మూడు కళ్లు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: