ఏపీలో ఓ మంత్రి ప‌ద‌వి ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలోకి జంప్ చేసేస్తార‌న్న పేరు తెచ్చుకున్నారు. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మార‌డంతో పాటు ప్ర‌తి ఎన్నిక‌కు ఓ నియోజ‌క‌వ‌ర్గం మారి వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తోన్న ఆ మంత్రి ఇప్ప‌టికే ప‌క్క చూపులు చూస్తున్నార‌ని.. జ‌గ‌న్ అండ్ టీంతో ట‌చ్‌లోకి వ‌చ్చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర‌కు చెందిన ఆ మంత్రి బాట‌లోనే ఇప్పుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన మ‌రో మంత్రి సైతం ప‌క్క చూపులు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌ద‌రు మంత్రి కూడా ప‌చ్చి అవ‌కాశ‌వాదే అన్న పేరుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కులాన్ని అడ్డం పెట్టుకుంటూ ఆ కులం పునాదుల మీద ఎదిగి... చివ‌ర‌కు తాను మంత్రి ప‌ద‌వులు పొంది..ఆ కులానికి ఏం చేయ‌లేద‌న్న అప‌ఖ్యాతి ఆయ‌న మూట క‌ట్టుకున్నారు.


ఆ మంత్రికి సైతం ప్ర‌జ‌ల బాగోగులు అక్క‌ర్లేదు. పార్టీ మారినా ఆయ‌న ప‌ద‌వి ఆయ‌న‌కు ఉంటే చాలు. గ‌తంలో కాంగ్రెస్ ఆ త‌ర్వాత ఓ ముఖ్య‌మంత్రికి ద‌గ్గ‌రై ఆయ‌న వెంట న‌డుస్తాన‌ని నిండా ముంచేసి ఆ త‌ర్వాత తెలుగుదేశంలోకి వ‌చ్చి ఇక్క‌డ చావుత‌ప్పి క‌న్నులొట్టబోయిన చందంగా గెలిచారు. ఆ త‌ర్వాత త‌న క్యాస్ట్ పేరు చెప్పుకుని బాబును బెదిరింది మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి కొట్టేశారు. జిల్లాలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని సొంత పార్టీలోనే చాలా మంది ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. 
కొంత మంది ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని... సొంత పార్టీ పెడ‌తానంటూ బాబుకే వార్నింగ్‌లు ఇచ్చిన ప‌రిస్థితి.


ఇక స‌ద‌రు మంత్రి ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు నుంచే పార్టీ మార్పు అంశంపై కావాల‌నే లీకులు ఇచ్చారు. చివ‌ర‌కు ఏదోలా సీటు రావ‌డంతో మ‌ళ్లీ పోటీ చేశారు. ఇంత‌కు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో గెలుస్తారా ?  లేదా ? అన్న‌ది త‌ర్వాత‌... ఆయ‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఎదురైంది. ఒక‌వేళ ట‌ఫ్ ఫైట్‌లో స్వ‌ల్ప మెజార్టీతో గెలిస్తే ఈ సారి మంత్రి ప‌ద‌వి కోసం కండువా మార్చేస్తానంటూ ఇప్ప‌టికే వైసీపీ వాళ్ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే ఒప్పుకునేది లేద‌ని.. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతోన్న వారు చాలా మందే ఉన్నార‌ని... వారికే ప‌ద‌వులు ఇవ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.


ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఈ వివాదం చినికి చినికి గాలివాన‌లా మారే ఛాన్స్ ఉండ‌డంతో పార్టీ పెద్ద‌లు మీరు కంగారు ఎందుకు ప‌డ‌తారు.... ముందు ఫ‌లితాలు రానివ్వండి.. ఆ త‌ర్వాత ఆయ‌న గెలిస్తే చూద్దాం అని జిల్లా పార్టీ నాయ‌కుల‌ను స‌ముదాయిస్తున్నార‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: