చంద్రబాబు పరిపాలన తీరుపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. సమీక్షల విషయంలో ఈసీ నిబంధనలను తప్పుబట్టటంపై వారు మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సమీక్షలకు హాజరుకాకపోవడాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.  


అధికారంలో ఉన్నంతకాలం రైతులను పట్టించుకోని సోమిరెడ్డి ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు అసలు వ్యవసాయంపై, ఏ విషయంలో సమీక్షలు జరపాలన్న విషయమై కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. యాక్షన్ ప్లాన్ లేకుండా ఖరీఫ్ సీజన్ పై సమీక్ష చేస్తానని సోమిరెడ్డి చెప్పడం సిగ్గుచేటు విషయమన్నారు.

సమీక్షలు ఎవరో అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు  డ్రామాలాడుతున్నారని కాకాని గోవర్థన్ రెడ్డి  ధ్వజమెత్తారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు,మంత్రులు క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌న్నారు.సమీక్షిస్తా..ఎవరూ అడ్డువస్తారో చూస్తా..లేదంటే రాజీనామా చేస్తా..కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తా అని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని.. దేనిమీద సమీక్ష చేయాలనుకుంటున్నారో స్పష్టత లేని పరిస్థితి ఉందని మండిపడ్డారు.

మార్చిలో మొదలు పెట్టితే మే నాటికి ధాన్యం కొనుగోలు పూర్తికావాలని..మార్చిలో ధాన్యం కొనుగోలుపై దృష్టిపెట్టకుండా..నేడు ధాన్యం కొనుగోలు పూర్తిఅయ్యే నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడుతున్నారని కాకాని దుయ్యబట్టారు. గతసంవత్సరం సోమిరెడ్డి మంత్రిగా పనిచేశారని,ధాన్యం కొనుగోలుకు పది శాతం కూడా గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు.మిలర్ల దగ్గర ముడుపులు తీసుకుని దళారీ వ్యవస్థను బలోపేతం చేశారని ధ్వజమెత్తారు. 

వ్యవసాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు కాని..రైతుల రుణభారాన్ని మాత్రం రెట్టింపు చేయడంలో టీడీపీ ప్రభుత్వం కిర్తీని సాధించిందని కాకాని ఎద్దేవా చేశారు.దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచిందని నాబార్డు S రిపోర్టు ఇచ్చిందన్నారు. దేశంలో రైతులకు అతితక్కువ ఆదాయం వచ్చే స్థానంలో ఏపీ ప్రథమం స్థానంలో ఉందని నివేదిక ఇచ్చిందన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపలేకపోయారు కాని..అవినీతి,అప్పుల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: