ఆంధ్రప్రదేశ్‌కు ఫోని గండం తప్పింది. బంగాళాఖాతంలో సుడులు తిరుగుతున్న ఫోనీ ఆంధ్రప్రదేశ్ తీరం దాటేసింది. ఒడిశా పరిధిలోనికి ప్రవేశించింది. ప్రచండ తుపానుగా మారిన పోని..  మధ్యాహ్నం ఒడిశా రాష్ట్రం పూరీకి ద‌క్షిణ దిశ‌గా తీరం దాటే అవ‌కాశం ఉంది. 


ఇంకా  ప్రచండ తుపాన్‌గానే ఫోనీ ప‌య‌నిస్తోంది. ఫోనీ గ‌మ‌నాన్ని ఆర్టీజీఎస్ అవేర్ విభాగం జాగ్రత్తగా గ‌మ‌నిస్తోంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఒడిశాకు వెళ్లిన ప్రచండ తుపాను  60 కిలో మీట‌ర్ల దూరంలో ప‌య‌నిస్తోంది. 

ఒడిశాలోని  గోపాల‌పురానికి ఆగ్నేయంగా 70 కిలోమీట‌ర్ల దూరంలో పోనీ కేంద్రీకృత‌మై ఉంది. ఒడిశావైపు గంట‌కు 11 కిలో మీట‌ర్ల వేగంతో కదులుతోంది.  ఒడిశా రాష్ట్రం పూరీకి ద‌క్షిణ దిశ‌గా తీరం దాటే అవ‌కాశం ఉంది. 

తుపాను నేపథ్యంలో ఒడిశా సర్కారు తగిన చర్యలు తీసుకుంది. అక్కడ ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఈసీ కూడా కోడ్ రద్దు చేసి తుపాను సహాయ చర్యలకు ఇబ్బంది లేకుండా చేసింది. ఫోనీ ప్రచండ తుపానుగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి బీభత్సం సృష్టిస్తోందోనని ఒడిశా వాసులు భయంగుప్పిట్లో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: