2019 సార్వత్రిక మరియు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సమయంలో అటు అభ్యర్ధులు ఇటు వివిధ పార్టీల నాయకులు చెసే ప్రసంగాలు శృతితప్పి రాగాన పడుతున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు నుండి అతి క్రింది స్థాయి కార్యకర్త వరకు మాట్లాడె మాటల్లో సభ్యత సంస్కారం మాత్రమే కాదు అన్-పార్లమెంటరీ బాష వాడకం బాగ పెరిగి పోయింది. ప్రజలకు తామే సంకేతాలిస్తున్నామో! సమాచారం ఇస్తున్నామో! తెలియనంత సోయిలేకుండా మాట్లాడటం జరుగుతుంది.
Image result for JC Diwakar reddy comments on expenditure
ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ, ఎన్నికల ఖర్చు పై 'టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి' చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్య లు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ వీర పాండియన్‌ రంగం సిద్ధంచేసినట్లు సమాచారం. ఎన్నికలలో గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ఆయన బహిరంగం గానే వ్యాఖ్యానించడంపై వైసిపి, సీపీఐ ఇతర పార్టీలు ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
Image result for JC Diwakar reddy comments on expenditure
ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఎన్నికల ఖర్చుపై టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకునేందుకు తగిన అవకాశం ఉందని గుర్తించారని తెలుస్తుంది. ఈసీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా తాడిపత్రి రిటర్నింగ్‌ అధికారి, జేసీ దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు "ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన" కిందకు వస్తాయని నిర్ధారించారు. దీనిపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ కు పూర్తిస్థాయి నివేదిక అందజేశారు. 

Image result for JC Diwakar reddy comments on expenditure

కాగా, జేసీ దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జేసీ అస్మిత్‌రెడ్డి, పవన్‌రెడ్డి లు ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆయన వ్యాఖ్యానించడం పెనుదుమారమే రేపింది.  కాగా, నివేదిక కలెక్టర్‌కు చేరిన నేపథ్యంలో జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: