మంగళగిరి.. ఇప్పుడు ఏపీలో అత్యధికంగా చర్చించుకుంటున్న నియోజకవర్గం ఇదే. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ పోటీకి దిగడమే అందుకు కారణం. తాజాగా మంగళగిరిలో ఓ బెట్టింగ్ రాకెట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


మంగళగిరిలో బెట్టింగు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.10.15 లక్షల నగదు, ఒక కారు, 7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగడంతో గెలుపు ఎవరి పక్షాన ఉందో చెప్పడం కష్టమవుతోంది. ఈ పరిస్థితి బెట్టింగ్‌లకు ఆస్కారం ఇస్తోంది. ఏకంగా ఎమ్మెల్యేలు, పార్టీల అగ్రస్థాయి నాయకులు కూడా స్వయంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. బాండు పేపర్లపై అగ్రిమెంటు రాసుకుని మరీ బెట్టింగ్ కాస్తున్నారట. 

ఐతే.. మంగళగిరిలో నారా లోకేశ్ పై దాదాపు 300 కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ గెలుస్తాడని కొందరు... ఓడిపోతాడని మరికొందరు భారీ స్థాయిలో బెట్టింగ్ కాస్తున్నారట. మధ్యవర్తుల దగ్గర డబ్బు ఉంచి.. పత్రాలు రాయించుకుంటున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: