ఏపీలో టీడీపీ, వైసీపీ ల మధ్య పిల్లీ ఎలకా చెలగాటం ఎపుడూ మామూలే. ఒకరిని ఒకరు నానా మాటలు అనుకుంటూంటారు. ఇది రాజకీయం అని సర్దిచెపుకున్నా సరైన సమయంలో స్పందించడంలో  టీడీపీ ఎపుడూ ముందు ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అక్కడ ఫార్టీ యియర్స్ అనుభవం ఉంది. మరి వైసీపీ సైతం ఇపుడు తన ధోరణి మార్చుకోవాలి


ఓ వైపు ఉత్తరాంధ్ర జిల్లాలు ఫోనీ తుపాను తాకిడికి అల్ల్లాడుతున్నారు. టీడీపీ ఈ విషయంలో ముందుగా మేలుకుని సహాయ చర్యలను చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చింది. చంద్రబబు ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితులకు తాము ఉన్నామని టీడీపీ ముందుండేలా కార్యక్రమాలు చేస్తున్నారు.


మరి జగన్ విషయం తీసుకుంటే ఆయన మౌన మునిలా ఉన్నారు. పోలింగ్ తరువాత పార్టీ యాక్టివిటీస్ పెద్దగా లేవు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫోనీ ముప్పు ఉన్న వేళ కూడా వైసీపీ తగిన విధంగా స్పందించకపోతే అది నెగిటివ్ ఫీలింగ్ జనాల్లోకి తీసుకువెళ్తుంది. వైసీపీకి అధికార యావ తప్ప మరేమీ లేదని కూడా ప్రత్యర్ధి పార్టీలతో పాటు, సామాన్య జనం సైతం అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జగన్ అలెర్ట్ కావాలి పార్టీ నాయకులను తుపాను బాధితులను ఆదుకునేలా పిలుపు ఇస్తే అది వైసీపీకే చాలా మంచిది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: