ఈ ఎన్నికల్లో 150 సీట్లు సాధిస్తాం...నూటికి వెయ్యి శాతం విజయం మాదే.. వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బెట్టింగుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు..ఇదీ రోజూ చంద్రబాబు మీడియా ముందు చెబుతున్న మాటలు.. కానీ అదే నోటితో ఆయన కొన్ని సంకేతాలు కూడా పంపుతున్నారు. 


జాగ్రత్తగా గమనిస్తే.. చంద్రబాబు మాటల్లో ఓటమి భయం కూడా కనిపిస్తోంది. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికలలో కౌంటింగ్ చాలా ముఖ్యమైనదని, కౌంటింగ్ మద్యలోనే ఏజెంట్లు వచ్చేయవద్దని చంద్రబాబు సూచిస్తున్నారు. 

కౌంటింగ్ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు మధ్యలోనే లేచి వచ్చేయ కూడదు. చివరిదాకా ఓపిగ్గా ఉండేవారినే ఏజెంట్లుగా పెట్టాలి అని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. అసలు ఏజంట్లు మధ్యలో ఎందుకు వస్తారు.. ఫలితాల ట్రెండ్‌ అర్థమైతే.. అలా చేస్తారు.. ఏదో ఒక

పార్టీ దూసుకుపోతుంటే.. ఇక మనం ఇక్కడ ఉండటం కూడా అనవసరం అనిపిస్తేనే ఏజంట్లు మధ్యలో బయటకు వస్తారు.. తమ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్స్ లేకపోతేనే అలా చేస్తారు. మరి చంద్రబాబు ఇలా ఎందుకు చెబుతున్నారు. అంటే టీడీపీ అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోయే ఛాన్స్ ఉందని ఆయన భావిస్తున్నారా.. లేక.. ఎందుకైనా మంచిదని ఇలా చెబుతున్నారా.. ఆయన ఏ ఉద్దేశ్యంతో చెప్పినా ఇది ఓటమికి సంకేతాలు ఇస్తున్నట్టుగానే జనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: