ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనిపిస్తోంది. తుని, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కాకినాడలో భారీ వర్షాలు ఉంటా యని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను శ్రీకాకుళం జిల్లాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒడిషాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 361 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80- 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉంది. మే 3వ తేదీన తుఫాన్ తీరం దాటే సమయంలో కూడా ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు అప్రమత్తం చేశారు. 


ఫోని ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని, గంటకు 130 నుంచి శుక్రవారం ఉదయం 10- 11 గంటల మధ్య ఒడిశాలోని పూరీ, బలుగోడు వద్ద ఫణి తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పెను తుఫాను తీరాన్ని దాటాకా ఈశాన్య దిశగా పయనిస్తూ.. తీవ్ర తుఫానుగా బలహీనపడి బెంగాల్ ‌తీరంలోకి ప్రవేశించ నుంది. 


రాత్రి కురిసిన భారీ వర్షాలకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో మామిడి, అరటి, జీడీ మామిడి, కొబ్బరి తోటలకు భారీ నష్టం కలిగింది. తుఫాను దృష్ట్యా కాకినాడ ఓడరేవులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. తుఫాను గమనాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నంకి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.


ప్రభావిత మండలాలు :

 శ్రీకాకుళం జిల్లా :  గార‌, ఇచ్ఛాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగాం, వ‌జ్రపుకొత్తూరు, శ్రీకాకుళం

విజ‌య‌న‌గ‌రం: భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌

విశాఖ‌ప‌ట్నం :  భీమునిప‌ట్నం

మరింత సమాచారం తెలుసుకోండి: