ప్రస్తుతం భారత దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తుంది.  ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అధినేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు.  ఈ సందర్బంగా ప్రత్యర్థి పార్టీలపై సమయం చిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తున్నారు.  ఈ సందర్బంగా కొన్ని సార్లు ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన అంక్షలు కూడా మితిమీరి పోతున్నారు.  తాజాగా బీజేపీ చీఫ్ అమిత్ షా హత్య కేసులో నిందితుడంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించలేదు. అది ఎన్నికల ప్రవర్తనా నిమమావళి ఉల్లంఘన కిందికి రాదంటూ గురువారం(మే-3,2019)రాహుల్ కి క్లీన్‌చిట్ ఇచ్చింది.  


లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఏప్రిల్-23న మధ్యప్రదేశ్ లోని సిహోరా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ...  అమిత్ షా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారని..హత్య కేసులో నిందితుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో ఆయన ఎంతో గౌరవాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు.  ఎప్పుడైన జయ్‌ షా పేరు విన్నారా? ఆయన ఒక ఇంద్రజాలికుడు.

ఆయన రూ.50,000ను మూడు నెలల్లో రూ.80 కోట్లు చేశారు రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  అంతే కాదు ఆ మద్య గ్యాంగ్‌ స్టర్ సోహ్రబుద్దీన్‌  హత్య కేసులో 2005లో అమిత్ షా మీద కేసు నమోదైందని అన్నారు.  కాగా, ఈ కేసు విషయంలో ఆధారాలు లేవన్న కారణంతో న్యాయస్థానం 2014లో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: