శ్రీనివాసరెడ్డి.. హాజిపూర్‌లో ముగ్గురు బాలికల ఉసురు తీసిన వ్యక్తి.. సైకో కిల్లర్.. అమ్మాయిలను బైక్ పై లిఫ్ట్ ఇచ్చి బావిలో  తోసేని.. గాయాలతో ఇబ్బందిపడుతున్న వారిపై పైశాచికంగా రేప్ చేసిన కిరాతకుడు.. ఒక్కరు కాదు.. ఇద్దరుకాదు.. ఇతడి బారిన పడిన వారు ఎందరో.


ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అత్యాచారాలపై విచారణ చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. శ్రీనివాసరెడ్డికి ఓ లవర్ కూడా ఉందట. అతని ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఈ అమ్మాయిని మాత్రం శ్రీనివాసరెడ్డి ఏమీ చేయలేదు. అమ్మాయి కనిపిస్తే దారుణానికి ఒడిగట్టే శ్రీనివాస్‌రెడ్డి ఈ యువతి విషయంలో మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి వెళ్లిన సమయంలో  శ్రీనివాస్‌రెడ్డికి  ఈ యువతి పరిచయమైందట. ఆమెపై మనసు పారేసుకున్న సైకో శ్రీనివాస్ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందుకు ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమెపై ఎలాంటి అఘాయిత్యమూ చేయలేదట. 

అదే ఆ అమ్మాయి.. శ్రీనివాసరెడ్డిని ప్రేమించకుండా వ్యతిరేకించి ఉంటే.. ఈ పాటి ఆమె కూడా హతురాలై ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని ప్రేమించడం ద్వారా ఆ అమ్మాయి బతికిపోయిందని వారు నమ్ముతున్నారు. శ్రీనివాస్‌రెడ్డి గురించి పూర్తిగా తెలియని ఆమె అతడితో చనువుగా ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: