శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిన సంగ‌త తెలిసిందే. ఈ నిర్ణ‌యం మంచిదేన‌ని కొంద‌రు వాదిస్తూ, అమ‌లు చేయాల‌ని కోరుతుంటే...మ‌రికొంద‌రు దానిని వ్య‌తిరేకిస్తున్నారు. అయితే, ఓ ముస్లిం విద్యాసంస్థ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  కేరళలోని ఒక ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణ దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సొసైటీ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బురఖా వాడకంపై నిషేధం విధించింది.


2019-20 విద్యా సంవత్సరం నుంచి బురఖాలు వేసుకోకూడ‌ద‌నే నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ గత నెల 19న రాష్ట్రంలోని తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. సదరు సర్క్యులర్‌లో నేరుగా బురఖా వాడొద్దని పేర్కొనలేదు. కేరళలో ఇస్లాం మతాన్ని పాటించాలే కానీ, మద్యప్రాచ్యంలోని ఇస్లాం పద్దతులను కాదని డాక్టర్ ఫజల్ గఫూర్ చెప్పారు. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బం ది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. 


ఇదిలాఉండ‌గా,  శ్రీ‌లంక‌లో దాడుల త‌ర్వాత బుర‌ఖా నిషేధం  విధించారు కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ ముథుక్కోయ థంగల్ మాట్లాడుతూ మత పరమైన అంశాలను ఎంఈఎస్ నిర్ణయించలేదన్నారు. వారు తీసుకున్న నిర్ణయం సరి కాదని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: