ఏపీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు ముగిసినా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం రోజూ మీడియాలో ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నారు. తమ గెలుపుపై రోజూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


అటు పవన్ కల్యాణ్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్క జగన్ మాత్రం ఎన్నికల తర్వాత ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్‌ ఆఫీసుకు వెళ్లి వచ్చారు. 

ఆ తర్వతా మీడియాకు కనిపించలేదు. తన వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. అయితే ఇదంతా జగన్ కు గెలుపై ఉన్న నమ్మకమే కారణమా.. లేక.. అతి విశ్వాసమా అన్న చర్చ సాగుతోంది. అయితే వైసీపీ నేతలు చెబుతున్న వాదన ఇంకోలా ఉంది. 

ఎలాగూ ప్రజాతీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడూ గెలుస్తామనే విషయం రోజూ మీడియా ముందు చెప్పడం అవసరమా అన్నది వారి వాదన. ఎలాగూ ప్రజాక్షేత్రంలో ఫలితాలు వెలువడతాయి.. అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకు పదే పదే వ్యాఖ్యలు చేయడం అన్న తరహాలో జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అదీ నిజమేగా. 



మరింత సమాచారం తెలుసుకోండి: