దేశంలో "నో వర్క్ ఆల్ ప్లే" ఎంత ప్రమాదమో "నో ప్లె అల్ల్ వర్క్" కూడా అంతే. ఎన్నికలైనాక రాత్రింబవళ్లు ఎన్నికలకోసం పనిచేసిన అందరికి మానసిక దైహిక విశ్రాంతి అవసరం. అది లేకుండా తెలుగుదేశం సభ్యులు అయిన పాపానికి వారిని వ్యక్తిగత విశ్రాంతి లేకుండా చేస్తున్నారు ఏపి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సమీక్షలు నిర్వహించాలనే ఒక దురద మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు అందుకే రేపటి నుండి ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆపై ప్రకటన తేది వరకు "ఏపిలో ఎన్నికలు జరిగిన తీరుపై సమీక్షల సంరంభం" మొదలు కానుంది. అంతవరకు ఈ తతంగం చేయటం ఎందుకు. అదే రోజున కౌంటింగ్ జరిగి ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘం పలితాల ప్రకటన ఉంటుంది కదా! ఏవడి పిచ్చి వాడికి ఆనందం అంటున్నారు వెక్స్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇక ఇతరులు ఈ తతంగం చూసి ఇందులో మర్మమేమైనా ఉందా! లేక మానసిక ఆరోగ్య స్థితిని అంచనా వేస్తున్నారు.   

Image result for chandrababu the suspicious leader

ఎన్నికలు ముగిసినా గెలుపు ఎవరిదన్నది 23 మే వరకు తేలని అంశం. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేకం. ఆయన మే 23 దాకా ఆగేది లేదంటు న్నారు. టీడీపీ అధినేత, 23 కు ముందే అన్ని లెక్కలు తేల్చేయాలని అంటున్నారు. దానికి కలసి వచ్చే అన్ని అవకాశాల్నీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా ఆయన ఈ క్రింది అంశాల అధారంగా తమ విజయాన్ని అంచనా వేయాలని కుతూహలంతో ఉన్నారు.  

Image result for chandrababu the suspicious leader

*పోలింగ్ సరళిని అధ్యయనం చెయ్యటం  
*అభ్యర్థులు, పార్టీ నేతలు చెబుతున్న లెక్కలతో  (సంబంధం లేకుండా కూడా) సమీక్షల ద్వారా విజయాన్ని బేరీజ్ వేయటం  
*గ్రామాలు, పోలింగ్ బూత్‌ ల వారీగా పోలింగ్ జరిగిన అంచనాల్ని రూపొందించుకొని మూలాల నుండి సమాచారం సేకరించుకోవటం 
*ఐటి గ్రిడ్స్ వద్ద ఉన్న పబ్లిక్  డేటాకి అనుసంధానించి  చూసి ఏ ఓటర్ టిడిపికి ఓటెయ్యలేదో తెలుసుకునే ప్రయత్నం చేయటం 
Image result for chandrababu the suspicious leader 
ఈ నెల 4 నుంచీ అంటే రేపటి నుండి నిరవధికంగా పలితాల ప్రకటన వరకు అన్నీ రోజులు మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ సెంటర్‌ లో పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థితో పాటూ, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ కు 40 నుంచీ 50 మంది నేతలు రానున్నారు. జెడ్పిటిసి సభ్యులు, ఎంపీపిలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు, ఏరియా ఇన్‌-ఛార్జులు, నియోజకవర్గ పరిశీలకులు ఈ సమీక్షలకు సమావేశాలకు రావాలని, టీడీపీ హైకమాండ్ తమ నేతలను కోరింది. తద్వారా మైక్రోలెవల్ నుండి  గ్రామస్థాయి, బూత్ స్థాయిల్లో పోలింగ్ సరళిని అంచనావేసి, మండల, నియోజకవర్గ స్థాయిలో మెజార్టీ లేదా ఎంత తగ్గిందనే దానిపై చంద్రబాబు అంచనాకు రావాలనుకుంటున్నట్లు తెలిసింది. అంటే ఈ ప్రయత్నానికి ముందే ఆయన 1000 శాతం విజయాన్ని అంచనా వేసి ఉన్నారు. దీనిద్వారా ఆధిక్యత అంచనా వేస్టారని తెలుస్తుంది. 


సమావేశాలకు సమీక్షలకు వచ్చే వీరంతా చెప్పే అంశాల్ని లెక్కలోకి తీసుకొని ప్రతి రోజూ రిపోర్టు ను అప్‌-డేట్ చేసుకోబోతున్నారు చంద్రబాబు. ప్రతిరోజూ 14అసెంబ్లీ నియోజక వర్గాల నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఐతే, ఈ సమావేశాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సిఎం చంద్రబాబు చర్చించ నున్నారు. ఇలా సమావేశాలు, సమీక్షలు జరపడం ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటు ఎవరికి పడిందో తెలుస్తుందనీ, తద్వారా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లువస్తాయో కనిపెట్ట వచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.
Image result for chandrababu the suspicious leader
గమ్మత్తేమంటే ఆయన వద్ద ఇప్పటికే ఉన్న డేటా-టిడిపి కీ పర్సన్ ఆద్వర్యంలో సర్వెల ద్వారా ఓటర్ల నుండి సేకరించిన  " ఏ ఓటరు ఎవరికి ఓటెస్తాడో, ఎవరు ఏ కులం వాడో, ఎవరు ఏ ఫలం ప్రభుత్వం నుండి పొండాడో" ఇదంతా బేరీజ్ వేస్తే టిడిపికి వచ్చే ఓట్లు రమా రమీ తెలుస్తాయి కదా! సమీక్ష సమాచార సేకరణలో లభించిన వివరాలని ఐటి గ్రిడ్స్ వద్ద ఉన్న డేటాకి అనుసంధానిస్తే మనకే ఓట్ల లెక్కింపుకు ముందే ఎంత ఆధిఖ్యత వస్తుందో తేలిపోతుందనేది చంద్రబాబు ఆలోచన కావచ్చు.   


రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో టీడీపీకి ఆదరణ పెరిగిందని భావిస్తున్న చంద్రబాబు, చివరి ఏడాది ప్రకటించిన పథకాలు  ఎంతవరకు మేలు చేశాయన్నది తెలుసు కోవాలనుకుంటున్నట్లు సమాచారం. అలాగే, తమ కంచు కోటగా భావిస్తున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఈసారి ప్రజలు టీడీపీకే పట్టం కట్టారా?  లేదా? అన్నది కూడా ఈ సమీక్షలతో తెలుస్తుందని భావిస్తున్నారు.
Image result for chandrababu the suspicious leader
ఈసారి టీడీపీకి షాక్ తప్పదనీ, వైసీపీ అధికారంలోకి వస్తుందని సోషల్ మీడియాలో రకరకాల సర్వేలు తెరపైకి వస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకింత టెన్షన్,  లేదా ఉద్వేగానికి గురౌతున్నట్లు సమాచారం. ఇలా సంకోచిస్తూ ఉండే కంటే, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా కచ్చితమైన సమాచారం తెలుసుకొని, ధీమాగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయినా ఇదంతా పూర్తవటానికి మే 22 వరకు పడ్తుంది గదా! 23న ఓట్ల లెక్కింపు మొదలవుతుంది గదా! అంటే,  విఙ్జుల సమాధానం "ఎన్నికల పలితాల వరకు అభ్యర్దు లతో జెల్-విత్ గా ఉండి ఎన్నికల పలితాల నాటికి వారు చేజారకుండా చూసుకునేందుకు చంద్రబాబు పన్నిన పన్నాగం" అంటున్నారు. గతంలో అలా చేసే అధికారం నిలబెట్టుకున్న చంద్రబాబుకు ఈ మాత్రం భయం ఉండటం సహజమేగా! "గుమ్మడికాయల దొంగకే కదా బూడిద అంటేది - అలా తప్పు చేసిన వారికే తప్పు వెరేవారు కూడా చేస్తే అన్న ఆలోచన కలగటం సహజం" కదా!    

మరింత సమాచారం తెలుసుకోండి: