తెలుగు రాష్ట్రాల్లో మ‌రో సంచ‌లన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో ఓ వ్య‌క్తి డ‌బ్బులు గుంజ‌డం ఇప్పుడు తీవ్ర క‌ల‌క‌లం రేపుంతోంది. ఎమ్మెస్కే పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న నిందితుడిని విజ‌య‌వాడ మాచ‌వ‌రం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమూరు నాగ‌రాజు విశాఖ‌ప‌ట్నం మ‌ధుర‌వాడలోని గాయ‌త్రీ న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్నాడు.


ఎంబీఏ పూర్తి చ‌దువుకున్న నాగ‌రాజు మంచి క్రికెట‌ర్ కూడా. 2014 లో ఆంధ్ర త‌ర‌ఫున రంజీల్లో ప్రాతినిద్యం వ‌హించాడు. 2016లో 82 గంట‌ల పాటు క్రికెట్ ఆడాడు. రికార్డ్ ఎక్కాడు. అయితే అత‌డి ప్ర‌తిభ‌ను చూసిన స్పాన్స‌ర్లు ముందుకొచ్చాయి. అలా వ‌చ్చిన డ‌బ్బుతో జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డాడు నాగ‌రాజు. ఇదే అద‌నుగా భావించి ఈజీ మ‌నీ కోసం కొంద‌రిని మోసం చేసి క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. 


అత‌డు క్రికెట్ ఆడుతున్న టైమ్‌లో బ‌హుమ‌తి అంద‌జేయ‌డానికి బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ హాజ‌ర‌య్యారు. ఆ క్ష‌నం నుంచి ఆయ‌నలాగా మాట్లాడ‌టం నేర్చుకున్నాడు. ఇంకేముంది త‌న ఫోన్‌లో ఎమ్మెస్కే ప్ర‌సాద్ పేరును ట్రూకాల‌ర్‌లో చేర్చాడు నాగ‌రాజు. ఆ రోజు నుంచి ప్రముఖుల‌కు ఫోన్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఎమ్మెస్కేనంటూ మాట్లాడుతూ న‌మ్మించాడు. 


ఎమ్మెస్కే పేరుతో మాట్లాడుతూ హైద‌రాబాద్‌లోని సెలెక్ట్ మొబైల్ షాపు ఎండీ ని న‌మ్మించాడు. నాగ‌రాజు అనే వ్య‌క్తి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ టీమ్‌కు ఎంపీకైన‌ట్లు చెప్పాడు. దీంతో అత‌డికి డ‌బ్బు ఇవ్వాల్సిందిగా చెప్పాడు. దీంతో ఆ మాట‌లు న‌మ్మిన స‌ద‌రు వ్య‌క్తి అత‌డి ఎకౌంట్లో 2 ల‌క్ష‌ల 88 వేల న‌గ‌దు ఆన్‌లైన్ ద్వారా పంపించాడు. 


ఇక చేసిన పాపం ఊరికే పోదు అంటారు క‌దా.. సేమ్ అలాగే చేద్ద‌మ‌నుకొని క‌ట‌క‌ట‌లాపాల‌య్యాడు నాగ‌రాజు. విజయవాడ రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యానికి ఫోన్‌ చేసి రూ.3.88 లక్షలు వసూలు చేశాడు. తన పేరుతో మోసగిస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్‌ హైదరాబాద్‌, విజయవాడ పోలీసులుకు ఫిర్యాదు చేశారు.


నిఘా పెట్టిన పోలీసుల‌కు ఊహించ‌ని విష‌యం తెలిసింది. షాక్ అయ్యారు అంద‌రూ. ఈ మోసాల‌కు పాల్ప‌డుతున్నది నాగ‌రాజే న‌ని గుర్తించారు పోలీసులు. గ‌న్న‌వ‌రం ప‌రిస‌రాల్లో సంచ‌రిస్తున్న అత‌డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక బైక్ తో పాటు రూ80500 న‌గ‌దు స్వాదీనం చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: