అయన దేశానికి ప్రధాని, మాటల మరాఠీ, అనేక యుద్ధాల్లొ ఆరితేరిన ఘనాపాఠి. అతి సులువుగా బేజేపీకి 2014 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి పెట్టిన మేటి. అటువంటి మోడీ మరో మారు ప్రధాని అవుతారని ఓ వైపు అంచనాలు ముమ్మరంగా ఉన్నాయి. ఇంకోవైపు మోడీతో ఢీ కొట్టేందుకు జాతీయ నాయకులు సైతం ససేమిరా అంటున్న పరిస్థితి. 


మరి అలాంటి మోడీతో ఢీ కొట్టాలంటే ఎన్ని గుండెలు ఉండాలి. విశాఖకు చెందిన మానవ్ మాత్రం డేరింగ్ అండ్ డేషింగ్ అంటూ ఏకంగా మోడీపైనే పోటీకి దిగిపోయాడు. ఉత్తరప్రదేశ్ వారణాసికి వెళ్ళి మరీ లొక్ సభ ఎన్నికల్లో  నామినేషన్ పత్రాలు దాఖలు చేసి  సై అంటూ తొడ గొట్టాదు. విశాఖనగరంలోకి విశాలాక్షివ్గర్ జోడుగుల్లపాలెం కి చెందిన మానవ్ మోడీటో ఢీ కొట్టడం పట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


వారణాసిలో మోడీతో పోటీకి తెలంగాణా, ఆంధ్రా నుంచి అనేకమంది  తెలుగువారు  నామినేషన్లు వేసినా అవన్నీ వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయి. ఒక్క మానవ్ ది మాత్రం ఆమోదం పొందింది. మొత్తం మీద మోడీతో పోటీ చేయడం తనకు ఆనందంగా ఉందని మానవ్ అంటున్నాడు.  కాగా తాజా ఎన్నికలలో ఆయన విశాఖ తూర్పు అసెంబ్లీ నుంచి ఇండెపెండెంట్ గా కూడా పోటీ చేశాడు. ఆ రిజల్ట్  మే 23న చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: