చంద్రబాబు పైకి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం ఓటమి భయం అలానే ఉంది. అది తన మాటల ద్వారా వ్యక్తం అవుతుంది. మన గెలుపు గుర్రాలతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్తున్నారని తెలుస్తోంది అంటున్న చంద్రబాబు తాను ప్రతిపక్షంలో ఉండబోతున్నాననే విషయాన్ని అంగీకరించినట్టయింది. సహజంగా అధికార పక్షంలోకే ప్రతిపక్షం నుంచి వలసలు ఉంటాయి. చంద్రబాబు చేసిన దుర్మార్గ రాజకీయాలతో ఐదేళ్లుగా ఎమ్మెల్యేల వలసలు మూకుమ్మడిగా, నిస్సిగ్గుగా జరిగాయి.


ఇలాంటి రోజుల్లో కూడా పార్టీతో పాటు పదవులకూ రాజీనామా చేస్తేనే చేర్చుకుంటామని ఖరాఖండిగా చెప్పే జగన్ లాంటి నాయకులు నిజంగా అరుదు. జగన్ సంగతి తెలిసి కూడా చంద్రబాబు భయంతో వణికిపోతున్నారు. తమ పార్టీలో గెలిచే నాయకులతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారేమోనని బాబు భయం. ఎలాగూ అధికారం దక్కదు, కనీసం సమీక్షలు జరుపుకోడానికైనా ఎమ్మెల్యేలు ఉండాలి కదా.


అలా కూడా ఎమ్మెల్యేలు తన పక్షాన ఉండకుండా ఎక్కడ వైసీపీలోకి జంప్ అయిపోతారేమో అనేది బాబు భయం. వలసల్ని ఆపే శక్తి చంద్రబాబుకి లేదు, కనీసం వలసలపై మాట్లాడే అర్హత కూడా ఆయనకు లేదు. అందుకే ఫలితాలకు ముందే ఇలాంటి కుట్రల్ని ఆపాలి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. తన పార్టీ నేతలపై వైసీపీ కన్నుపడిందని అన్నప్పుడే చంద్రబాబు ఓటమిని ఒప్పుకున్నట్టు లెక్క. అలా అధికారం వైసీపీదే అని ఒప్పుకుంటున్న చంద్రబాబు నూరుశాతం, వెయ్యిశాతం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇకపై రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు భయపడుతున్నట్టు మాత్రం ఉండవు అని చెప్పొచ్చు. హుందా రాజకీయాలు చేస్తున్న జగన్, టీడీపీ ఎమ్మెల్యేల జోలికి వెళ్లకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: