హైద‌రాబాద్‌లో ఓ కారు డ్రైవ‌ర్ ఘ‌న‌కార్యం వెలుగులోకొచ్చింది. అన్నం పెట్టిన ఇంటిపైనే క‌న్నేశాడు ఆ కారు డ్రైవ‌ర్‌. న‌మ్మకంగా ప‌నిచేస్తూ.. తిన్నింటి వాసాలే లెక్క‌బెట్టాడు. తొమ్మిదేళ్లుగా ప‌నిచేస్తూ.. ఏకంగా రూ.63 ల‌క్ష‌లు కాజిసిన ఆ డ్రైవ‌ర్ చివ‌ర‌కు జైలుపాల‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై సైబ‌ర్ క్రామ్ పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చిత్తూరు జిల్లాకు చెందిన వెంక‌ట‌ర‌మ‌ణ దంప‌తులు ప‌నికి చేరారు.


ఇక 2012 లో వెంక‌ట‌ర‌మ‌ణ దంప‌తులు ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఎంతో న‌మ్మ‌కంగా ప‌నిచేస్తున్నారు. వెంక‌ట‌ర‌మ‌ణ కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేసేవాడు. అయితే ఆ విశ్రాంత ఐఏఎస్ అధికారికి వ‌య‌స్సు పై బ‌డ‌టంతో ఆన్‌లైన్ ట్రాన్జాక్ష‌న్స్ అన్ని కారు డ్రైవ‌ర్‌తోనే చేయించేవారు. ఇదే అద‌నుగా భావించిన నిందితుడు ఆ అధికారి బ్యాంక్ వివ‌రాలు అన్ని సేక‌రించాడు. ఓ జిరాక్స్ షాప్‌లోని ఇంట‌ర్‌నెట్ లో ఆ వివ‌రాలతో లాగిన్ అయ్యాడు.


ఇంకేముందు త‌న‌కు కావాల్సిన‌ప్పుడ‌ల్లా డ‌బ్బును త‌న ఎకౌంట్లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేవాడు. అంత‌కాదు.. న‌గ‌దు బ‌దిలీ చేస్తున్న్ందుకు ఆ జిరాక్స్ షాపు య‌జ‌మానికి కొంత క‌మిష‌న్ కూడా ఇచ్చేవాడు.. ఇలా ఆ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎకౌంట్ నుంచి వ‌న్ ఇయ‌ర్‌లోనే రూ.63 ల‌క్ష‌లు ట్రాన్స్ ఫ‌ర్ చేసుకున్నాడు. అయితే డ‌బ్బును ట్రాన్స్ ఫ‌ర్ చేసే టైమ్‌లో ఐఏఎస్ అధికారి ఫోన్ కు ఓటీపీ వ‌స్తుంది. ఆ టైమ్‌లో త‌న భార్య స‌హాయంతో ఓటీపీని తెలుసుకునే వాడు. ఆత‌ర్వాత డ‌బ్బులు పంపించుకునే వాడు. 


త‌న ఖాతా నుంచి మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు గుర్తించిన ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీసీఎస్ సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంట్లో ప‌నిచేసే వెంక‌ట‌ర‌మ‌ణ‌నే ఆన్‌లైన్‌లో మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్న‌ట్లు గుర్తించించారు. ఇంకేముంది త‌మ స్టైల్‌లో ప‌నిమిషి పాటు ఆమె భార్త వెంక‌ట‌ర‌మ‌ణ‌ను విచారించ‌గా.. నిజం ఒప్పుకున్న‌ట్లు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు వెల్ల‌డించారు. నిందితుడి వ‌ద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు త‌ర‌లించారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: