ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల మొదలుపెట్టిన బై బై బాబు అనే నినాదం ఎంత పాపులరైందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నికలైపోయి సమీక్షలు చేస్తున్న సమయంలో చంద్రబాబునాయుడులో అదే నినాదంపై కొత్త టెన్షన్ మొదలైందట. సమీక్షల సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఆయన మానసిక పరిస్ధితికి అద్దం పడుతోంది.

 

సమీక్షల్లో చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి ఎంఎల్ఏ అభ్యర్ధులతో వైసిపి నేతలు టచ్ లో ఉన్నారంటూ చెప్పటం పార్టీలో కలకలం రేగింది. పలువురు మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ఎంఎల్ఏ అభ్యర్ధులు కూడా వైసిపితో టచ్ లో ఉన్నారంటూ ఓ ప్రచారమైతే జరుగుతోంది. మరి అందులో నిజమెంత అన్నది మాత్రం తెలియటం లేదు.

 

అలాంటిది అదే విషయాన్ని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించటంతో జరుగుతున్న ప్రచారం నిజమే అని రూఢీ అయింది. వైసిపి నేతలే టిడిపి అభ్యర్ధులతో టచ్ లోకి వస్తున్నారా లేకపోతే టిడిపి అభ్యర్ధులే వైసిపితో టచ్ లోకి వెళ్ళారా అన్నదే సస్పెన్సుగా మారింది.

 

నిజానికి టిడిపి అభ్యర్ధులతో టచ్ లోకి వెళ్ళాల్సిన అవసరమైతే ప్రస్తుతానికి వైసిపికి లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చేది తామే అన్న నమ్మకం వైసిపిలో ఉంది కాబట్టి వారెవరికీ  టిడిపి అభ్యర్ధుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో పార్టీ అధికారంలోకి రాకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన కొందరు మంత్రులు, అభ్యర్ధులే ముందుజాగ్రత్తగా వైసిపితో టచ్ లోకి వెళ్ళేందుకే అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా టిడిపి అభ్యర్ధుల నుండి బై బై బాబు ప్రారంభం అయ్యేట్లుంది చూడబోతే

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: