తెలుగుదేశం పార్టీలో చంద్రబాబే అధినాయకుడు. ఆయన్ని కాదనే ధైర్యం ఎవరికీ లేదు. బాబుకు కాదంటే సైకిల్ దిగిపోవాల్సిందే. ఐతే టీడీపీని స్థాపించిన మహామహుడు అన్న నందమూరినే పార్టీ నుంచి బయటకు పంపించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. అందువల్ల రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ రాజకీయాల్లో ఏదీ జరగదు అని చెప్పడానికైతే లేదు.


ఇదిలా ఉండగా  టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్ది   హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు. డీజీపీ ఠాకూర్‌పై వైఎస్సార్ సీపీ అనేక ఫిర్యాదులు చేసినా బదిలీ చేయలేదన్నారు.


లోకల్‌ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదనే భయాందోళనతో టీడీపీ నేతలు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని  శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని, ఎన్నికలకు ముందు ఈవీఎంలు వద్దని, టీడీపీ ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసునన్నారు. బాబు అధికారంలో ఉండి చెయ్యరాని పనులు చేశారని ఆరోపించారు. మొత్తానికి చంద్రబాబుకు టీడీపీలో గండం పొంచి ఉందన్న సత్యాన్ని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ముందే పసిగట్టి గుట్టు విప్పేశారులా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: