ఏపీ ముఖ్య‌మంత్రి ,తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అవాక్క‌య్యేలా...తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు. రాజ‌కీయాలు, త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌డంలో చంద్ర‌బాబు బిజీగా కేసీఆర్ మాత్రం త‌న రాష్ట్రానికి కావాల్సిన ప‌నులు చేసుకోవ‌డంలో నేర్ప‌రిత‌నం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా, క‌ర్ణాటక‌తో చ‌ర్చ‌లు కీల‌క అంశాన్ని కొలిక్కి తీసుకువ‌చ్చారు కేసీఆర్‌. సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం కుమారస్వామి స్వయంగా ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్‌కు తెలిపారు. 


గతంలో నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా స‌మ‌స్య‌ను సానుకూలంగా ప‌రిష్క‌రించుకునేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. మహబూబ్‌నగర్ ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏప్రిల్ 30న కర్ణాటక సీఎంను సీఎం కేసీఆర్ కోరారు. వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎస్ టీఎం విజయ్ భాస్కర్‌కు సీఎస్ ఎస్‌కే జోషి కూడా లేఖ రాశారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్ విన‌తికి క‌ర్ణాట‌క సర్కారు ఓకే చెప్పేసింది. నీటి విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ సాయంత్రం నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ర్ణాటక సీఎం కుమారస్వామికి తెలంగాణ ప్రజల పక్షాన, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే సుహృద్భావ, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ ఉభయ రాష్ర్టాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: