మొన్నటి వరకు ఏపిలో ఎన్నికల హడావుడి ఓ రేంజ్ లో కొనసాగిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ముఖ్య పార్టీ నేతలు విపరీతంగా ప్రచారాలు చేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఏపిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి.  ఓ వైపు ఫొని తుఫాన్ చెలరేగిపోతుంది..మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి.  తాజాగా అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

అమరావతిలోని ఉండవల్లిలో కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగలబడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇవి పక్కనే ఉన్న పంటపొలాలకు కూడా వ్యాపించాయి.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హుటాహుటిన అగ్రిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పి అదుపుతోకి తీసుకు వచ్చారు.

అయితే అంత భారీ భద్రత ఉండే సీఎం ఇంటి వద్దే ఇలా అగ్ని ప్రమాదం జరగడంపై ఏపి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.  బహుషా ఎవరైనా ఆకతాయి సిగరేట్, బీడీ లాంటివి ముట్టించి అక్కడ గడ్డివాములో పడివేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని భావిస్తున్నారు.  అయితే ఈ విషయం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: